- '30 నైపుణ్యాభివృద్ధి కళాశాలలు ఏర్పాటు చేయాలి'
రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కళాశాలల ఏర్పాటును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యంగా మార్చారు'
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. మీడియా ప్రతినిధులపై వరుస దాడులు, ఎస్సీల అనుమానాస్పద మరణాలు, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జర్నలిస్ట్ వెంకట నారాయణపై దాడి, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయడం తదితర అంశాలపై ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మంత్రి పెద్దిరెడ్డికి కరోనా
సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా తన ప్రభావాన్ని చూపిస్తోంది. తాజాగా రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రికి వైరస్ సోకింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వాలంటీర్‌కు బెదిరింపులు
గ్రామ వాలంటీర్ అయిన తనను వైకాపా నేతలు అవినీతికి పాల్పడమని బెదిరిస్తున్నారని ఓ మహిళ ఆరోపించింది. తన భర్త తెదేపా అభిమాని అయినందున పార్టీ మారకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారని ఆవేదన చెందుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మెట్రో కూతతో వ్యాప్తి తీవ్రం!'
కరోనా కేసులు గణనీయంగా పెరుగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసుల పునఃప్రారంభం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామంతో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఉద్ధృతమయ్యే ప్రమాదం ఉందని ఐసీఎమ్ఆర్ అధికారి డా. గిరిధర్ జ్ఞాని.. 'ఈటీవీ భారత్'తో ముఖాముఖిలో హెచ్చరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రముఖుల నివాళులు
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖులు ప్రణబ్‌కు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అమెరికా, చైనా విచారం
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల చైనా విచారం వ్యక్తం చేసింది. భారత్- చైనా స్నేహబంధానికి ఆయన మరణం తీరని లోటు అని పేర్కొంది. భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని ప్రణబ్ ముఖర్జీ లోతుగా విశ్వసించారని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- లాభాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 273, నిఫ్టీ 83 పాయింట్లు లాభపడ్డాయి. ఏజీఆర్ బకాయిలకు సంబంధించి పదేళ్ల గడువు ఇస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టెలికాం షేర్లు 4 శాతం లాభపడ్డాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- జకోవిక్ శుభారంభం
యూఎస్ ఓపెన్‌లో సెర్బియా స్టార్ ఆటగాడు నొవాక్ జకోవిక్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో డామిర్ జుముర్‌పై 6-1, 6-4, 6-1 తేడాతో గెలుపొందాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భారీగా అమ్ముడవుతోన్న 'ప్రభాస్ చాక్లెట్లు'
జపాన్‌లో 'డార్లింగ్ ప్రభాస్' పేరిట మింట్ చాక్లెట్లు తయారుచేసి విక్రయిస్తున్నారు అక్కడి అభిమానులు. భారీ స్థాయిలో ఇవి అమ్ముడుపోతున్నాయని సమాచారం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.