- 'ఆ కుటుంబానికి ట్రాక్టర్ కొనిస్తా'
సినిమాల్లో విలన్ అయినా... సమాజంపై తనకున్న బాధ్యతను నెరవేర్చటంలో హీరో పాత్ర పోషిస్తున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'గ్లౌజులు ఇవ్వకపోతే ఎలా..?'
ఆసుపత్రుల్లో మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. వైద్య సిబ్బందికి కనీసం గ్లౌజులు కూడా సమకూర్చలేని స్థితిలో వైద్య ఆరోగ్య శాఖ ఉందని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- శరీరంలో ఆక్సిజన్ తగ్గితే ఏమవుతుంది?
కరోనాను జయించడానికి శరీరంలో రోగనిరోధక శక్తి పెంచే ఆహారంతో పాటు... స్వచ్ఛమైన ప్రాణవాయువు కీలక పాత్ర పోషిస్తుందని ఊపిరితిత్తుల వైద్య విభాగం నిపుణులు డాక్టర్ కంచర్ల అనిల్ తెలిపారు. ఆక్సిజన్ స్థాయి తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఏవోబీలో ఎదురుకాల్పులు
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మరోసారి తుపాకి గర్జించింది. ఆదివారం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 3వేల మంది కరోనా రోగులు మిస్సింగ్
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న కర్ణాటక బెంగళూరులో 3 వేల మందికి పైగా కరోనా రోగుల ఆచూకీ గల్లంతవడం కలకలం రేపుతోంది. ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కరోనాపై చర్చకే!
రాజస్థాన్ అసెంబ్లీని ఎలాగైనా సమావేశపరచాలనే వ్యూహరచనలో భాగంగా బలనిరూపణ అంశాన్ని సీఎం అశోక్ గహ్లోత్ పక్కకు పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత, ఇతర బిల్లులపై చర్చించేందుకే సమావేశాలు ఏర్పాటు చేయాలనే కారణాలతో గవర్నర్ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'పాక్ వాసులే ఎక్కువ'
నవ సంబంధాలను చిన్నాభిన్నం చేసే ఉగ్రవాదంలో.. పాకిస్థాన్‌దే కీలక పాత్ర అని ఉద్ఘాటించింది ఐక్యరాజ్యసమితి. ముష్కర మూకల నాయకత్వ స్థానాల్లో ఎక్కువగా పాక్ వాసులే ఉన్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మాంద్యం నుంచి భారత్ U-షేప్ రికవరీ
కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర మాంద్యం నెలకొంది. అయితే ఈ సంక్షోభం తాత్కాలికమేనని.. ఆర్థిక వ్యవస్థ V లేదా U-షేప్ రికవరీని సాధిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అనుష్క కోసం కోహ్లీ ఏం చేశాడంటే?
లాక్‌డౌన్‌తో ఇంతకాలం ఇంటికే పరిమితమైన టీమ్ఇండియా సారథి కోహ్లీ.. ఈ సమయంలో తన భార్య, హీరోయిన్ అనుష్క శర్మ కోసం కేక్ తయారు చేసినట్లు చెప్పాడు. ఆ రోజు ఓ ప్రత్యేకమైనదిగా ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఓ అందమైన మోసం'
బాలీవుడ్లో తనకు ఇప్పటికీ పని దొరుకుతున్న కారణంగా బంధుప్రీతి గురించి బాధపడట్లేదని తెలిపింది హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. చిత్రపరిశ్రమ అనేది ప్రపంచంలోనే ఓ అందమైన మోసమని అభిప్రాయపడింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.