- ఆ రోజు రాత్రి ఇలా కొట్టారా?
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసులు ఓ ఎస్సీ యువకుడిని అరెస్టు చేసి... శిరోముండనం చేయించిన ఘటన మెున్న రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. తప్పును ప్రశ్నించినందుకు.. ఆ యువకుడిని చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే.. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ప్రభుత్వమే చంపేసింది'
తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొన్నిరోజుల క్రితం కిషోర్‌ను పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పి శారీరక, మానసిక హింస పెట్టారని మండిపడ్డారు. వైకాపా వేధింపులకు మనస్థాపంతో మృతి చెందడం బాధాకరమన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆకలి తీర్చలేక శిశువు విక్రయం
కరోనా.. కరోనా.. ఏం చేసిందంటే..? తల్లికి బిడ్డలను దూరం చేసింది. కళ్ల ముందే అయినవారు చనిపోతున్నా.. దగ్గరికి చేరలేని నిస్సహాయులుగా మిగిలేలా చేసింది. బంధాలు, బంధుత్వాలు కనుమరుగయ్యేలా చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వరదలో కొట్టుకుపోయిన యువకుడు
వరద దాటిగా ప్రవహిస్తున్న రోడ్డును దాటేందుకు ప్రయత్నించగా ఓ యువకుడు కొట్టుకుపోయిన ఘటన అనంతపురం జిల్లా గుంతకుల్లులో జరిగింది. యువకుడి కోసం గాలించగా రెండు కిలోమీటర్ల దూరంలో కనిపించాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'రాజ'కీయం.. మరికాసేపట్లో గవర్నర్‌తో భాజపా నేతల భేటీ
రాజస్థాన్ భాజపా అధ్యక్షుడు సతీశ్ పూనియా, శాసనసభ విపక్ష నేత గులాబ్ చంద్ కఠారియా సహా 13మంది బృందం సాయంత్రం 5 గంటలకు గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలవనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై గవర్నర్‌కు నేతలు విజ్ఞప్తి చేయనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- జనావాసాల్లో చిరుత హల్చల్
అడవిలో ఉండే చిరుతపులి అర్ధరాత్రి ఒక్కసారిగా ఊర్లోకి వచ్చి హల్ చల్ చేసిన ఘటన ఉత్తరాఖండ్ దేవప్రయాగ్‌లో జరిగింది. పశువుల పాక వద్దకు చిరుత రావడం వల్ల అక్కడ ఉన్న గేదెలు, ఆవులు భయంతో పరుగులు తీశాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మొలకు మాస్కు కట్టి.. లండన్ వీధుల్లో..
కరోనా కాలంలో అంతా ముఖానికి మాస్కు ధరిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ముఖానికి ధరించాల్సిన మాస్కును మొలకు కట్టి ప్రఖ్యాత లండన్ వీధుల్లో కలియతిరిగాడు. ఆశ్చర్యానికి గురిచేసే ఈ కథేమిటో మీరే చూసేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'పన్ను చట్టాల సరళీకృతమే ప్రభుత్వ లక్ష్యం'
ఆదాయపు పన్ను చట్టాలను మరింత సరళీకృతం చేసి.. పన్ను చెల్లింపుదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. ఆదాయపన్ను 160వ దినోత్సవం సందర్భంగా కీలక సందేశం అందించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ధోనీ విఫలమైతే మాత్రం కష్టమే'
లాక్డౌన్ కారణంగా ఇంతకాలం వాయిదా పడ్డ ఐపీఎల్‌కు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ 19 నుంచి ఈ లీగ్ నిర్వహించనున్నారు. అయితే ఇప్పుడు దృష్టంతా ధోనీమీదే పడింది. తాజాగా ఈ విషయమై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ స్పందించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ప్లాస్మా దానం చేయండి'
కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా వారియర్లు ఇప్పుడు ప్రాణ రక్షకులు కావాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.