- చంద్రబాబు చెప్పినవన్నీఅబద్ధాలే
గవర్నర్‌కు రాసిన లేఖలో చంద్రబాబు అన్నీ అబద్ధాలే రాశారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ నిర్ణయమని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- అన్నాబత్తుని శివకుమార్‌కు కరోనా
తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. మరో వైకాపా నేతకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'దళితులపై వైకాపా కక్ష తీర్చుకుంటోంది'
ఓట్లేసి గెలిపించినందుకు దళితులపై వైకాపా ప్రభుత్వం కక్ష తీర్చుకుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. గతంలో సుధాకర్, అనితారాణిని వేధించారని.. తాజాగా న్యాయమూర్తి రామకృష్ణపైనా.. దాడికి పాల్పడ్డారని అన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- శ్రీశైలానికి స్థిరంగా వరద
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి 42,448 క్యూసెక్కులకు పైగా నీరు చేరుతోంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- రఫేల్ పై వాయుసేన చర్చ
చైనాతో సరిహద్దు ఉద్రిక్తలపై చర్చించేందుకు ఈ నెల 22న వైమానిక దళ ఉన్నతాధికారులు సమావేశంకానున్నారు. ఈ నెల చివర్లో దేశానికి రానున్న రఫేల్ యుద్ధ విమానాల మోహరింపు, వాటి పనితీరుపైనా ఈ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో చర్చించనున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'ఆపరేషన్ కరోనా'
కరోనా సంక్షోభాన్ని దేశం ఎదుర్కొన్న తీరును పార్లమెంటరీ ప్యానెళ్లు పరిశీలిస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ఆ ఒప్పందం కష్టమే!
సమీప భవిష్యత్తులో ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెలలో వియత్నాంతో ఈయూ ఒప్పందం కుదుర్చుకోవడం భారత్‌కు ప్రతికూలంగా మారిందని విశ్లేషిస్తున్నారు. బ్రెగ్జిట్ వంటి పరిణామాలు దీనికి మరో కారణంగా చెబుతున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- అగ్రదేశాల యుద్ధం!
కరోనా వైరస్ టీకాను కనిపెట్టడమే ప్రపంచ దేశాల ప్రథమ కర్తవ్యం. ఇప్పటికే పలు దేశాల్లో శాస్త్రవేత్తలు ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 150కు పైగా టీకాలు వివిధ దశల్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ టీకా తయారీ అగ్రరాజ్యాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- నా తప్పుడు నిర్ణయాల వల్లే భారత్ ఓడింది
సిడ్నీ వేదికగా 2008లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమికి అంపైర్ల తప్పిదాలు కూడా కారణం. తాజాగా ఈ విషయంపై స్పందించాడు అంపైర్ స్టీవ్ బక్నర్. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'నీ లాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం'
బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా జన్మదినం సందర్భంగా ఆమె భర్త నిక్ జోనస్ ప్రేమతో శుభాకాంక్షలు తెలిపాడు. ప్రియాంక లాంటి వ్యక్తి నా జీవితంలోకి రావడం ఎంతో అదృష్టమని పేర్కొన్నాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి