- పదో తరగతి విద్యార్థులంతా పాస్
కరోనా వ్యాప్తి ప్రభావంతో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2020 నాటికి నమోదైన పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్టు ప్రకటించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు... సీఎం జగన్‌కు లేఖ రాశారు. కరోనా లాక్ డౌన్ వల్ల 20 లక్షల మంది భవన, నిర్మాణ కార్మికులు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని ఆదుకునేందుకు ఒక్కొక్కరికి రూ. 5 వేలు ఆర్థిక సాయం చేయాలని సీఎంను కోరారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- జోక్యం మానుకోండి
పద్మనాభస్వామి ఆలయ వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా.. మానసాస్ ట్రస్టు యాజమాన్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రభుత్వం మానుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. సంరక్షకులుగా గజపతి కుటుంబ హక్కులు పరిరక్షించబడాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- వేర్పాటు ఉద్యమాలు రాకూడదనే... మూడు రాజధానులు
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో రాష్ట్రంలోని ఏడు చోట్ల ఏడు నక్షత్రాల హోటళ్లు నిర్మించేలా ప్రణాళిక చేపట్టామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పదేళ్ల తరువాత వేర్పాటు ఉద్యమాలు రాకూడదనే జగన్ మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకున్నారని వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- కాంగ్రెస్‌కు సచిన్ కౌంటర్
సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగించిన అనంతరం తొలిసారిగా స్పందించారాయన. 'నిజాన్ని వక్రీకరించగలరేమో కానీ.. ఓడించలేరు' అంటూ ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- యూపీ సర్కార్ కీలక నివేదిక
వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌కు సంబంధించి అన్ని వివరాలతో స్థితి నివేదిక దాఖలు చేయనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ పూర్తి వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేయాలన్న పిటిషన్లను ఈ నెల 20న విచారించనున్నట్టు వెల్లడించింది అత్యున్నత న్యాయస్థానం. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- గూగుల్ ఇండియా ఎలా మారింది?
గూగుల్ భారత్‌లో ప్రవేశించినప్పుడు ప్రధానంగా దృష్టిసారించిన అంశాలు కేవలం సినిమాలు, క్రికెట్. ఇప్పుడు ప్రపంచానికి కొత్త ఆవిష్కరణలు అందించడంలో గూగుల్ ముందంజలో ఉంది. ఇదెలా సాధ్యమైంది? వినోదమే ప్రధాన వ్యాపార సూత్రంగా పనిచేసిన 'గూగుల్ ఇండియా' ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అత్యవసర సాంకేతికతను అభివృద్ధి చేసే స్థాయికి ఎలా ఎదిగింది? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- స్వతంత్రం సాధ్యమా? ఎప్పటికి?
1971లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. బంగ్లాదేశ్ పుట్టుకలో కీలకంగా వ్యవహరించింది భారత దేశమే. మరి పాకిస్థాన్‌లో కొన్నేళ్లుగా మరో స్వతంత్ర దేశం కోసం పోరాటం సాగుతోంది. దీనికి భారత్ మద్దతు ఎంత వరకు ఉంది? అక్కడి నేతలు ఏమంటున్నారు? మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- బరిలోకి డివిలియర్స్
టీ20, టీ10, ద హండ్రెడ్ లీగ్ తర్వాత క్రికెట్ ప్రపంచంలో మరో కొత్త ఫార్మాట్ పరిచయం కాబోతోంది. ఇప్పటివరకు ఒక మ్యాచ్‌లో రెండు జట్లు పాల్గొనడం ఆనవాయితీ. అయితే ఈసారి ఒకే మ్యాచ్‌లో మూడు టీమ్‌లు ఆడనున్నాయి. ఒక్కో జట్టులో కేవలం 8 మందికి మాత్రమే స్థానం ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ట్రోఫీని కాకుండా బంగారు, వెండి, కాంస్యం పతకాలను బహుమతిగా అందిస్తారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ప్రాణాలతో చెలగాటమే
కరోనా ప్రభావం తీవ్రమవుతున్న తరుణంలో ఇండోర్ షూటింగ్ అంటే ప్రాణాలతో చెలగాటమేనని అభిప్రాయపడ్డారు బాలీవుడ్ దర్శకనిర్మాత శేఖర్ కపూర్. ఇలా చేస్తే కరోనా త్వరగా వ్యాపించే అవకాశముందని అన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి