రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 44,086 మంది నమూనాలు పరీక్షించగా 523 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 608 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,566 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల ప్రకాశం జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఒకరు మృతి చెందారు.
ఇదీ చదవండి: