రాష్ట్రంలో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2282 కు చేరింది. కొత్తగా చిత్తూరులో 15, కృష్ణా 15, నెల్లూరు 7, తూర్పుగోదావరి , కర్నూలు 4 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వివిధ ఆస్పత్రుల నుంచి 94 మందిని విడుదల చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.కొత్తగా వైరస్‌తో ఎటువంటి మరణం సంభవించలేదని తెలిపింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 705 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: