అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ.. తుళ్లూరు, మందడం, వెలగపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నెక్కళ్లు, అబ్బరాజు పాలెంలో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు... మందడం, వెలగపూడి, తుళ్లూరులో పర్యటించారు. రైతుల దీక్షకు సంఘీభావం ప్రకటించారు. మూడు రాజధానుల ప్రకటన నీటిమీద రాతలాగా మిగిలిపోతుందన్నారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని వెంకటపాలెంలో రైతులు గ్రామదేవతకు మొక్కులు చెల్లించారు.
ఇదీ చదవండి: ప్రియురాలి కుటుంబ సభ్యుల దాడి.. యువకుడు మృతి