పరిపాలన రాజధానిగా అమరావతినే కొసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు 427వ రోజు ఆందోళనలు చేశారు. తుళ్లూరు, వెలగపూడి, కృష్ణాయపాలెం, పెదపరిమి, వెంకటపాలెం, నెక్కల్లులో రైతులు, మహిళలు నిరసన దీక్షలతో పాటు ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దంటూ ఆందోళన కొనసాగించారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆటలను అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. ఉద్యమాల ద్వారానే పరిశ్రమను ప్రైవేటీకరించకుండా కాపాడుకుంటామని రైతులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: