రాష్ట్రవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లలో మినహా అన్ని ప్రాంతాల్లో ఉన్నత పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. 99 శాతం పాఠశాలల్లో 87 శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. 39 శాతం మంది 9వ తరగతి విద్యార్థులు, 44 శాతం మంది పదవ తరగతి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లారు.
మొత్తంగా 42శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రభుత్వం తెలిపింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం ఏపీ మోడల్ పాఠశాల వాచ్‌మన్‌కు, నెల్లూరు మండలం పాతవెల్లంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు కొవిడ్ సోకినట్టు గుర్తించారు. ఆ పాఠశాలలను అధికారులు శానిటైజ్ చేయించారు.
ఇదీ చదవండి: