ETV Bharat / city

రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు - ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్​ వార్తలు

రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో వైకాపా తరఫున నలుగురు, తెలుగుదేశం నుంచి ఒకరు పోటీ పడుతున్నారు. మొత్తం 175 మంది శాసనసభ్యులు ఓటు హక్కు వినియోగించుకునే ఎన్నికల్లో... విజేతలెవరో సాయంత్రానికి తేలిపోనుంది.

రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్​

author img

By

Published : Jun 19, 2020, 2:46 AM IST

Updated : Jun 19, 2020, 3:12 AM IST

రాష్ట్రంలో రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్​ శుక్రవారం జరగనుంది. రాష్ట్రానికి సంబంధించి నాలుగు స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్​ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ ప్రక్రియ... సాయంత్రం 4 గంటల వరకూ జరగనుంది. 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. కౌంటింగ్ పూర్తవగానే ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 4 స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైకాపా నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, తెలుగుదేశం నుంచి వర్ల రామయ్య పోటీలో ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న 175 మంది రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మార్చి 26వ తేదీనే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ... కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డాయి.

తొలి ప్రాధాన్య ఓటు

రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు తొలి ప్రాధాన్య ఓటే వేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు వైకాపా నిర్దేశించింది. తగినంత బలం ఉన్న పరిస్థితుల్లో రెండు, మూడు ప్రాధాన్య ఓట్లు వేస్తే పొరపాట్లు దొర్లుతాయనే ఉద్దేశంతో... తొలి ప్రాధాన్య ఓటుకే పరిమితం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఒక్కో అభ్యర్థికి 36 ఓట్లు వస్తే సరిపోతుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఏవైనా ఓట్లు చెల్లకపోతే ఆ మేరకు మార్పు ఉంటుంది. ఈ లెక్కన ముగ్గురు అభ్యర్థులకు 38 ఓట్ల చొప్పున, నాలుగో అభ్యర్థికి 37 ఓట్లు వేసేలా వైకాపా విభజన చేసింది. ఈమేరకు విప్ జారీ చేసింది. వైకాపా నుంచి బరిలో ఉన్న నలుగురు అభ్యర్థులు... మర్యాదపూర్వకంగా పార్టీ ఎమ్మెల్యేలను కలిశారు. రాజ్యసభ అభ్యర్థి పరిమళ్ నత్వానీ... సీఎంతో భేటీ అయ్యారు.

ఆ ముగ్గురూ ఏం చేస్తారు..?

బలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం... ఇప్పటికే ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. పార్టీకి దూరంగా ఉంటున్న కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి సహా 23 మందికీ విప్ ఇచ్చింది. సభ్యులంతా తప్పనిసరిగా ఓటేయాలని ఆదేశించింది. ఏజెంట్‌కు చూపించి ఓటు వేయాలనే నిబంధన ఉండటంతో... పార్టీకి దూరమైన ముగ్గురు ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. ఇక ఉదయం పదకొండున్నర గంటలకు చంద్రబాబు నేతృత్వాన శాననసభాపక్ష కార్యాలయంలో సమావేశం కానున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు.... 12 గంటలకు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పార్టీ అభ్యర్థి వర్ల రామయ్యకు ఎమ్మెల్సీ అశోక్ బాబు ఏజెంట్‌గా వ్యవహరించనుండగా.... పార్టీ తరఫున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఏజెంట్‌గా ఉంటున్నారు.

ఇదీ చూడండి..

మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలి: కాల్వ శ్రీనివాసులు

Last Updated : Jun 19, 2020, 3:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.