- " class="align-text-top noRightClick twitterSection" data="">
- 'ఆ బాధ్యత కేంద్రానిదే'
బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచే బాధ్యత కేంద్రానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై కేంద్రం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కొవిడ్ నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కష్టపడేవారికి సముచిత స్థానం
నరసరావుపేట, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాలకు తెదేపా కమిటీలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడేవారికి సముచిత స్థానం ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదు'
అధికారంలోకి వచ్చాక.. పారదర్శకంగా పరిపాలన అందిస్తానన్న మాట ఏమైందని సీఎం జగన్‌ను మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. కృష్ణా జిల్లా మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కుమారుడి కళ్లను కాపాడిన తల్లి
ఒక్కగానొక్క కుమారుడు క్షణికావేశంలో తన నుంచి దూరం అయినా.. అతడి కళ్లను సజీవంగా ఉంచాలనుకుంది ఆ తల్లి. ఈ మేరకు ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తన కుమారుడి నేత్రాలను దానం చేసింది. పుట్టెడు దుఃఖంలోనూ.. ఇంతటి గొప్ప ఆలోచన చేసిన ఆమెను వైద్యులు అభినందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పీఏసీ భేటీలో దుమారం!
పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సమావేశంలో.. ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. వ్యాక్సిన్ విధానాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ టీకా భేష్!
కరోనా డెల్టా ప్లస్ వేరియంట్‌పై ఎన్‌టీఏజీఐ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోడా కీలక వ్యాఖ్యలు చేశారు. డెల్టా రకం వైరస్‌పై కొవిషీల్డ్ ఒక డోసు 61 శాతం, రెండు డోసులు 65 శాతం ప్రభావం చూపుతున్నాయన్నారు. రెండు డోసుల ప్రభావం మధ్య పెద్దగా తేడా లేదని, అందువల్ల డోసుల వ్యవధి పెంచడం వల్ల నష్టం లేదని వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జలుబుతో కొవిడ్ నుంచి రక్షణ!
కరోనా వైరస్‌ను నివారించేందుకు ఓవైపు అనేక వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువస్తుండగా.. మరోవైపు చికిత్స కోసం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్.. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొని, రక్షణ కల్పిస్తున్నట్లు అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమెరికా ఫెడరల్ కోర్టు జడ్జిగా భారత మహిళ!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సారథ్యంలో మరో భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. పౌర హక్కుల న్యాయవాది సరళా విద్య నాగాలను కనెక్టికట్ రాష్ట్రంలో ఫెడరల్ జడ్జిగా ప్రతిపాదించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ సిరీస్‌లకు స్టార్ క్రికెటర్లు దూరం
ఐపీఎల్లో ఆడిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు కొందరు.. త్వరలో వెస్టిండీస్, బంగ్లాదేశ్‌తో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమయ్యారు. వీరిలో కమిన్స్, స్మిత్, వార్నర్ తదితరులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాలీవుడ్లో దర్శకుడిగా
బాలీవుడ్లో దర్శకుడిగా మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు స్టంట్ కొరియోగ్రాఫర్ రవివర్మ. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఈ విషయమై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.