- ASANI CYCLONE: "అసని" అలజడి... రాష్ట్రంలో భారీ వర్షాలు
ASANI CYCLONE: రాష్ట్రంలో అసని తుపాన్ తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్రతుపాన్.. బలహీనపడి తుపాన్‌గా మారింది. చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులుతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈదురుగాలుల ప్రభావంతో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది.
- CM on Cyclone: సహాయ శిబిరంలో వ్యక్తికి వెయ్యి, కుటుంబానికి రూ.2 వేలు: సీఎం జగన్
CM jagan on cyclone: 'అసని' తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. 'అసని' తుపానుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
- విశాఖ రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే
NGT on Rishikonda: విశాఖ రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపొద్దని ఎన్జీటీ ఆదేశించింది.
- Gummanuru: 'గడప గడపకు ప్రభుత్వం'.. మంత్రి గుమ్మనూరును నిలదీసిన ప్రజలు
Minister Gummanuru Jayaram: "గడప గడపకు ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను ప్రజలు నిలదీశారు. తమకు అనేక పథకాలు అందడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలన్నీ పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
- తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలి: పవన్‌కల్యాణ్
Pawan Kalyan on Asani: రాష్ట్రంలో నెలకొన్న అసని తుపాను ప్రభావం కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సూచించారు. ఈ ప్రకృతి విపత్తు బారినపడే వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
- మాకు పథకాలు అందించండి.. మునిమడుగులో ఎమ్మెల్యే, ఎంపీలకు మహిళల మొర
మునిమడుగులో ఎమ్మెల్యే శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్‌లకు స్థానికులు సమస్యలతో స్వాగతం పలికారు. మహిళలు తమకు ప్రభుత్వ పథకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
- చంద్రబాబు కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడితే ఊరుకోం: తెదేపా
TDP LEADERS FIRE: తెదేపా ముఖ్యనేతలనే వైకాపా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు పెడుతోందని ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసులో చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణీలను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
- నరేంద్ర మోదీ ఓ అద్భుతం: వెంకయ్య
Modi 20 book: మోదీ@20 పుస్తకం విడుదల చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రధాని మోదీ ఓ అద్భుతమని కొనియాడారు. ఈ పుస్తకం ఆధునిక భారత్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరి పరిణామ క్రమాన్ని పాఠకులకు అందిస్తుందని పేర్కొన్నారు.
- మార్కెట్లోకి 'టాటా నెక్సాన్ మ్యాక్స్' ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 437 కి.మీ జర్నీ
TATA Nexon EV Max: నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది టాటా. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 437 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపింది. అధునాతన ఫీచర్లతో అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఈ వాహనం.. వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపింది.
- బాలీవుడ్‌పై నేనలా అనలేదే.. మీకలా అర్థమైందా: మహేశ్
Maheshbabu Bollywood comments: బాలీవుడ్‌పై తాను చేసిన కామెంట్స్ గురించి వివరణ ఇచ్చారు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. తాను అన్ని భాషలను గౌరవిస్తానని చెప్పారు. అర్థమైందా?