ETV Bharat / city

తెలంగాణ: సగటు తీసి.. స్లాబ్‌ లెక్కిస్తారు

లాక్​డౌన్ సడలింపు కారణంగా ఇక నుంచి ఇంటింటికీ తిరిగి విద్యుత్తు బిల్లుల జారీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి మూడు నెలల రీడింగ్​ని తీసి ఏ విధంగా బిల్లు ఇవ్వాలో సంస్థ నిర్ణయానికి వచ్చేసింది. ఆ మేరకు సాఫ్ట్​వేర్​లో మార్పులు కూడా చేసినట్లు అధికారులు వెల్లడించారు.

telengana news
తెలంగాణ: సగటు తీసి.. స్లాబ్‌ లెక్కిస్తారు
author img

By

Published : Jun 1, 2020, 5:15 PM IST

లాక్‌డౌన్‌ సడలింపుతో ఇంటింటికి తిరిగి విద్యుత్తు బిల్లుల జారీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి జూన్‌లో ఒకేసారి రీడింగ్‌ నమోదు చేయనున్నారు. కంటెన్మెంట్​ మినహా అన్ని ప్రాంతాల్లో మీటర్‌ రీడింగ్‌ తీస్తారు. మూడు నెలలకు ఒకేసారి రీడింగ్‌ తీస్తుండటంతో ఏ విధంగా బిల్లు ఇవ్వాలనే విషయమై ఇప్పటికే డిస్కం ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ మేరకు బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నారు. వినియోగదారులకు భారం కాకుండా, డిస్కం నష్టపోకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.

లాక్‌డౌన్‌తో వాయిదా..

విద్యుత్తు వినియోగానికి సంబంధించి సాధారణంగా ప్రతి నెలా బిల్లులు జారీ చేస్తుంటారు. మార్చి వినియోగానికి సంబంధించి ఏప్రిల్‌ ఒకటి నుంచి రీడింగ్‌ నమోదు ప్రారంభించి పదో తేదీ వరకు పూర్తి చేయాలి. లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. గత ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించిన బిల్లులను ఈ సంవత్సరం కట్టించుకుంది. ఒక రకంగా ఇది ముందస్తు చెల్లింపులాంటిది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల వాస్తవ వినియోగానికి సంబంధించి ఈ నెలలో రీడింగ్‌ నమోదు చేస్తారు. ఈ నెలలో ఇచ్చే బిల్లులో ఏప్రిల్‌, మేలో చెల్లించిన మొత్తాన్ని తీసేసి మిగిలిన బిల్లు ఇస్తారు.

లెక్కింపు ఇలా..

విద్యుత్తు వాడకం పెరిగే కొద్దీ ఛార్జీలు పెరిగే స్లాబ్‌ విధానం ప్రస్తుతం మన దగ్గర అమల్లో ఉంది. నెల రోజులకు మాత్రమే ఈ స్లాబ్‌ వరిస్తుంది. ప్రస్తుతం మూడు నెలలకు ఒకేసారి రీడింగ్‌ తీస్తుండటంతో బిల్లుల జారీపై ఆసక్తి నెలకొంది. డిస్కం డైరెక్టర్‌ ఒకరు చెప్పిన దాని ప్రకారం.. 3 నెలల సగటు యూనిట్లు తీసి ఒక్కో నెలకు ఆ సగటు యూనిట్ల స్లాబ్‌ను వర్తింపజేస్తారు. ఇలా 3 నెలలకు వేర్వేరుగా లెక్కిస్తారు. ఈ మొత్తం బిల్లులోంచి ఏప్రిల్‌, మేలో కట్టిన డబ్బును మినహాయిస్తారు. బిల్లులో ఈ లెక్కలన్నీ కన్పించే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. ఇళ్లకు తాళం వేసి ఉంటే సగటు బిల్లులు జారీ చేస్తారు. పాడైన మీటర్ల రీడింగ్‌ లెక్కింపు ఎలా అనే విషయమై సమాలోచనలు చేస్తున్నారు. వీటన్నింటిపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద భారీగా నిలిచిన వాహనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.