రాష్ట్రంలో కొత్తగా 2,367 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,40,730కు చేరింది. తాజాగా వైరస్ బారినపడి మరో 11 మంది మృతి చెందగా... మెుత్తం మరణాల సంఖ్య 6,779 గా ఉంది. కొవిడ్ నుంచి మరో 2,747 మంది కోలుకున్నారు. మొత్తం బాధితుల సంఖ్య 8.12 లక్షల మందిగా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,434 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 85.87 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు బులెటిన్ లో పేర్కొంది.
జిల్లాల వారీగా...
కొత్త కేసులు నమోదైన వాటిలో తూర్పుగోదావరి జిల్లాల్లో 386, పశ్చిమ గోదావరి జిల్లాలో 361, కృష్ణా జిల్లాలో 358, చిత్తూరు జిల్లాలో 255, గుంటూరు జిల్లాలో 226, నెల్లూరు జిల్లాలో 153, విశాఖ జిల్లాలో 135, కడప జిల్లాలో 131, శ్రీకాకుళం జిల్లాలో 102, ప్రకాశం జిల్లాలో 84, విజయనగరం జిల్లాలో 78, అనంతపురం జిల్లాలో 61, కర్నూలు జిల్లాలో 37 కేసులు నిర్ధరణ అయ్యాయి.
ఇదీ చదవండి
'శ్రీదేవి అక్కా.. పేకాట గురించి మాట్లాడలేదని ప్రమాణం చేస్తారా?'