ETV Bharat / city

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్​లోని శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో భారీగా విదేశీ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. వారి నుంచి రూ. 1.2 కోట్లు విలువైన 2.4 కిలోల బరువు కలిగిన 21 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ శివకృష్ణ తెలిపారు.

gold seized
gold seized
author img

By

Published : May 18, 2021, 7:35 AM IST

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో భారీగా విదేశీ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఇద్దరు.. దుబాయ్ నుంచి శంషాబాద్ చేరుకోగా.. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. రూ. 1.2 కోట్లు విలువైన 2.4 కిలోల 21 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ శివకృష్ణ తెలిపారు.

బంగారు బిస్కెట్లను ప్యాంటు జేబుల్లో పెట్టుకుని తెచ్చినట్లు వివరించారు. ఇద్దరు ప్రయాణికులపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. బంగారం స్మగ్లింగ్‌ చేసేందుకే హైదరాబాద్‌ నుంచి వారు దుబాయ్‌ వెళ్లినట్లు అనుమానిస్తున్న కస్టమ్స్‌ అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

విషాదం: రోడ్డు ప్రమాదంలో కరోనా బాధితురాలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.