- Lock To Village Secretariat: పంట బీమా రాలేదని.. గ్రామ సచివాలయానికి తాళం
Lock To Village Secretariat: పంట నష్టపోయిన 1,100 మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే పంట బీమా వచ్చిందని.. మిగిలిన వారికి రాలేదని ఆగ్రహం చెందిన రైతులు సచివాలయానికి తాళం వేశారు.
- గంజాయి మత్తులో యువకుల వీరంగం.. పోలీసు వాహనం ధ్వంసం
Young men halchal in Hyderabad : హైదరాబాద్‌లో అర్ధరాత్రి యువకులు హల్చల్ చేశారు. గంజాయి మత్తులో ఉన్న వారు పోలీసు వాహనం పైకి ఎక్కి వీరంగం సృష్టించారు. పోలీస్ వాహనంతో పాటు ఇతర వాహనాలు ధ్వంసం చేసి నానా హంగామా చేశారు. ఆ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు.. మోదీ కీలక ఆదేశాలు
PM Modi Govt jobs: దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారు. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఖాళీలపై సమీక్ష నిర్వహించిన మోదీ.. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను మిషన్ మోడ్‌లో భర్తీ చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.
- రెండోరోజు ఈడీ కార్యాలయానికి రాహుల్.. నేతల భారీ నిరసన.. పలువురు అరెస్ట్!
RAHUL GANDHI ED: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో రోజు విచారణకు హాజరైన రాహుల్.. ముందుగా సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, పలువురు నేతలు రాహుల్‌కు సంఘీభావం తెలిపారు.
- పరువు హత్యల కలకలం.. పెళ్లైన 5 రోజులకే దంపతులను దారుణంగా నరికి..
Kumbakonam Honor Killing: ప్రేమించి పెళ్లిచేసుకున్న ఓ జంటను.. యువతి కుటుంబసభ్యులు దారుణంగా హత్య చేశారు. పెళ్లైన 5 రోజులకే ఇద్దరిని పొట్టనపెట్టుకున్నారు. తమిళనాడు కుంభకోణంలో ఈ ఘటన జరిగింది.
- తల్లి ఒడి నుంచి నడిరోడ్డుపై జారిపడ్డ చిన్నారి.. ఎదురుగా బస్సు.. దేవుడిలా వచ్చి..
Toddlers Life Save: ప్రాణాలకు తెగించి ఓ చిన్నారిని కాపాడాడు ఓ ట్రాఫిక్ సిబ్బంది. ఈ-రిక్షాలో ఉన్న తల్లి ఒడి నుంచి రోడ్డుపై పడిపోయింది చిన్నారి. ఎదురుగా ఓ బస్సు ఆమెపైకి దూసుకొస్తుండగా.. అక్కేడ విధులు నిర్వర్తిస్తున్న సిటీ పాట్రోల్ యూనిట్ జవాన్ సుందర్ శర్మ ప్రాణాలను లెక్కచేయక రక్షించాడు. ఉత్తరాఖండ్ కాశీపుర్లోని చీమా చౌరాహా వద్ద ఈ ఘటన జరిగింది. ఈ-రిక్షా అతివేగంతో టర్న్ చేయడంతోనే చిన్నారి కిందపడిపోయింది. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. సుందర్ శర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
- గోవులకు పసందైన ఆహారం.. 800కేజీల మ్యాంగో జ్యూస్.. 600 కేజీల డ్రైఫ్రూట్స్..
Cows special feast Gujarat: గుజరాత్ వడోదరలో గోవులకు పసందైన ఆహారం అందించారు దాతలు. కజ్రాన్ మియాగం ప్రాంతంలోని పంజ్రపోల్లో.. ఆవులకు 800 కేజీల మ్యాంగో జ్యూస్‌ను అందించారు. 600 కేజీల డ్రైఫ్రూట్లనూ పశువులకు ఆహారంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ నీటి తొట్టెలో ఉంచిన జ్యూస్‌ను గోవులు తాగుతున్నట్లు అందులో కనిపిస్తోంది.
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. భారీగా పతనమైన బిట్‌కాయిన్
Gold Price Today: బంగారం, వెండి ధరలు మంగళవారం తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,290గా ఉంది. కిలో వెండి ధర రూ. 61,800గా ఉంది. బిట్‌కాయిన్ విలువ ఒక్కరోజే 10 శాతానికిపైగా పతనమైంది.
- సింధు, ప్రణీత్‌కు షాక్.. తొలి మ్యాచ్‌లోనే ఓడి ఇంటికి..
Sindhu Indonesia Open: ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్‌కు షాక్ తగిలింది. తమ తమ తొలి మ్యాచ్‌ల్లోనే ఓడి ఇంటిముఖం పట్టారు.
- అభిమానుల మనసు దోచుకున్న రష్మిక
Rashmika: రష్మిక చేసిన ఓ పని అభిమానుల మనసు దోచుకుంది. నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అసలేం జరిగిందంటే...