- "అమరావతి గడ్డపైన గడ్డి కూడా తొలగించలేరు"
అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరిన సందర్భంగా.. అమరావతి రైతులకు తెదేపా నేతలు మద్దతు తెలిపారు. రాజధానిలోని రైతుల దీక్షా శిబిరాన్ని నారా లోకేశ్, ఎంపీ గల్లా జయదేవ్ సందర్శించారు. రైతులు, మహిళల పోరాటానికి మద్దతు తెలిపారు. రైతులకు న్యాయం జరిగేవరకు పోరాటంలో ముందుంటామని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- పోలీసులపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
వైకాపా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో తమపై తప్పుడు కేసుల పెట్టారని...తీరా అధికారంలోకి వచ్చాక కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- టీషర్టు వేసుకోకూడదా, ఫ్లైట్ ఎక్కకూడదా..!
వైకాపా నేతలపై తెదేపానేత అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు లేనిదే మనం లేమనే విషయాన్ని వైకాపా నేతలు ఎప్పుడు తెలుసుకుంటారో అర్థం కావటంలేదని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- తీవ్రంగా మారనున్న వాయుగుండం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. ఈ రోజు రాత్రి తీవ్రవాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి తీవ్ర భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- నాణెం విడుదల చేసిన మోదీ
గ్వాలియర్ రాజమాతగా ప్రసిద్ధిగాంచిన భాజపా నేత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా.. ప్రత్యేక నాణెం విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సింధియా.. తన జీవితాన్ని పేదలకే అంకితమిచ్చారని మోదీ కీర్తించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- కాంగ్రెస్కు ఖుష్బూ రాజీనామా.. భాజపాలో చేరిక!
ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపారు. ఖుష్బూను అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ ప్రకటించిన కాసేపటికే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధం లేని నేతల దిశానిర్దేశం నచ్చక కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ఖుష్బూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- భారీ అగ్నిప్రమాదం- 60 గుడిసెలు దగ్ధం!
ఉత్తర్ప్రదేశ్ ఏశ్బాగ్లోని దోబీఘాట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. 50-60 గుడిసెలు మంటల్లో చిక్కుకున్నాయి. అయితే ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మంటలు అదుపుచేసినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- పాత టీబీ టీకాతో కరోనాకు చెక్!
క్షయ వ్యాధి చికిత్స కోసం గతంలో వినియోగించిన బీసీజీ టీకా.. కరోనాపై పోరులో ఏ మేరకు ఉపయోగపడుతుందనే అంశంపై బ్రిటన్లో పరిశోధనలు జరగనున్నాయి. ఆరోగ్య కార్యకర్తలపై ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. సానుకూల ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు పరిశోధకులు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- రషీద్ ఖాన్ భార్య హీరోయిన్ అనుష్క శర్మనా?
సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ భార్య పేరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ అని గూగుల్ చూపిస్తోంది. దీంతో అభిమానులు షాక్ తింటున్నారు. అసలు ఎందుకిలా చూపిస్తోందంటే? మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- పోలీస్ స్టేషన్లో రవితేజ.. మహాసముద్రంలో అదితీ
హీరో రవితేజ 'క్రాక్', శర్వానంద్ 'మహాసముద్రం' సినిమాల కొత్త అప్డేట్లను పంచుకున్నారు. సెట్లో మాస్ మాహారాజా సందడి చేస్తుండగా, శర్వానంద్-సిద్ధార్థ్ సినిమాలో అదితీ రావు హైదరీ హీరోయిన్గా ఎంపికైంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి