- అధికారంలోకి రాగానే.. ఒకే సంతకంతో.. : అచ్చెన్నాయుడు
ATCHANNA: చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలదే అధికారమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైకాపా లాగా.. తెదేపా గాలికి పుట్టిన పార్టీ కాదన్న అచ్చెన్న.. ప్రజల మనస్సుల్లో నుంచి పుట్టిన పార్టీ అని అన్నారు.
- ఏపీ పేరు ‘వైఎస్సార్‌ప్రదేశ్’గా మార్చండి.. సీబీఐ మాజీ డైరెక్టర్ ట్వీట్
CBI former director tweet: రాష్ట్రం పేరును ‘వైఎస్సార్ ప్రదేశ్’గా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌కి నా విన్నపమంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
- అన్నగారిపై అభిమానం అట్లుంటది మరి.. వందలాది తెదేపా బొమ్మల తయారీ!
ఎన్టీఆర్ అనే పేరు వింటే ఆయన పులకించిపోతారు.. వయసు 83 ఏళ్లు దాటినా ఎన్టీవోడిపై ప్రేమ పెరిగిందే తప్ప, తగ్గలేదంటారాయన.. అందుకే అన్నగారు దూరమైనా.. ఆయన పెట్టిన పార్టీకి నేనుసైతం అంటూ సేవ చేస్తున్నారు. తెదేపాపై మమకారంతో.. తెలుగుదేశం పార్టీ గుర్తుతో ప్రతిమలు తయారు చేస్తూ మహానాడు ప్రతినిధులకు అందించేందుకు సిద్ధమయ్యారు. మరి, ఆయనెవరు అన్నది చూడాలంటే.. ఈ వార్త చదవాల్సిందే!
- Murder: విశాఖ మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ వద్ద యువకుడి హత్య..
Murder: విశాఖ మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ వద్ద దారుణం జరిగింది. స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు వెళ్లిన తేజ అనే యువకుడు.. హత్యకు గురయ్యాడు. మద్యం సేవించే సమయంలో.. తేజకు మరో యువకునితో ఘర్షణ జరిగింది. తేజను కొందరు యువకులు చితకబాదుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- 'డోలీ'నే అంబులెన్స్.. పాము కరిచిన వ్యక్తిని మోస్తూ ఆరు కిలోమీటర్లు!
DOLI: ప్రమాదం తీవ్రతను బట్టి కొన్నిసార్లు నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.. అలాంటి బాధితులకు ఎంత త్వరగా వైద్యం అందిస్తే.. ప్రాణాలు రక్షించడానికి అంత మేర అవకాశం ఉంటుంది.. మరి, అంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ఏం కావాలి? అంబులెన్స్ లేదా.. మరో వాహనం కావాలి. కానీ.. అభివృద్ధికి దూరంగా అడవుల్లో బతికే గిరిజనానికి.. వాహన సౌకర్యం సంగతి అటుంచితే.. నడిచేందుకు కనీసం దారి కూడా లేని దుస్థితికి దర్పణం ఈ ఘటన.
- Accident: అనకాపల్లి జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి
Accident: అనకాపల్లి జిల్లాలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఘటనల్లో ఆరుగురు మరణించగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నర్సీపట్నంలోని అప్పన్నదొరపాలెం కూడలి వద్ద కారు బోల్తాపడి ముగ్గురు మరణించారు.
- నటి హత్యకు రివెంజ్.. నలుగురు ముష్కరులు హతం.. మూడు రోజుల్లో 10 మంది
Kashmir encounter: జమ్ముకశ్మీర్‌లో వరుస దాడులతో పెట్రేగిపోతున్న ఉగ్రవాదులకు చెక్ పెట్టేపనిలో ఉన్నారు అక్కడి పోలీసులు. ఎన్కౌంటర్ల జరిపి వారిని మట్టుపెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల టీవీ నటి హత్యకు కారణమైన ఇద్దరు ముష్కరులను కూడా మట్టుబెట్టారు.
- రచయిత్రి గీతాంజలి శ్రీకి ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్
Geetanjali Shree: ప్రముఖ హిందీ రచయిత్రి గీతాంజలి శ్రీకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అవార్డు దక్కింది. ఈ గౌరవం పొందిన తొలి భారతీయ రచయిత్రిగా ఆమె అరుదైన ఘనత సాధించారు.
- బతిమలాడుతున్నా డిక్కీలో పడేసి.. టియర్ గ్యాస్ వదిలి.. పోలీసుల రాక్షసత్వం!
Brazil News: బ్రెజిల్లో ఓ నల్లజాతీయుడి మృతికి కారణమయ్యారు పోలీసులు. అతడ్ని క్రూరంగా హింసించి ఎస్యువీ డిక్కీలో పడేసి టియర్ గ్యాస్‌తో హింసించారు. దీంతో అతడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసి బ్రెజిల్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.
- మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. భారీగా పతనమైన క్రిప్టో.. నేటి లెక్కలు ఇలా
Gold Rate Today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి రూ.52,740కు చేరింది. కిలో వెండి ధర రూ.63,803 వద్ద కొనసాగుతోంది. మరోవైపు క్రిప్టోకరెన్సీల్లో బిట్‌కాయిన్ భారీ నష్టాలను నమోదు చేసింది.