ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 1PM - 1PM TOP NEWS

ప్రధాన వార్తలు @ 1PM

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1PM
author img

By

Published : Oct 6, 2021, 1:02 PM IST

  • విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో బంటు సతీష్ అనే టెంట్ హౌస్ కార్మికుడు మృతి చెందాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగింది. క్యూలైన్‌కు సంబంధించిన సామగ్రిని తీసుకొచ్చిన సమయంలో ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెబుతున్నారు.

  • CHINTHA MOHAN: 'విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కానివ్వం'

విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వబోమని కాంగ్రెస్‌ నేత చింతా మోహన్ తెలిపారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో కష్టపడి సాధించిన పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం దారుణమని పేర్కొన్నారు.

  • తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో పురోగతి

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో (Telugu Academy Case) దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. తెలుగు అకాడమీ అకౌంట్స్‌ అధికారి రమేశ్​ను పోలీసులు అరెస్టు చేశారు. మోసానికి పాల్పడిన ముగ్గురు బ్యాంక్‌ ఏజెంట్లు వెంకట్, రాజ్‌కుమార్, సాయిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Sricity: ఉత్తమ పారిశ్రామిక పార్కుగా శ్రీసిటీ

కేంద్ర వాణిజ్యశాఖ ఆధ్వర్యంలోని డీపీఐఐటీ దేశంలోని ఉత్తమ పారిశ్రామిక పార్కులను ప్రకటించింది. ఈ జాబితాలో దక్షిణాది నుంచి శ్రీసిటీ(SRICITY) ఒక్కటే స్థానం దక్కించుకొంది. ఇండస్ట్రియల్‌ పార్కు రేటింగ్స్‌ సిస్టం-2.0లో.. 41 పారిశ్రామిక పార్కులు ఉత్తమ పనితీరు కనబరిచి, లీడర్లుగా నిలిచాయి.

  • 'ఓవైపు 75ఏళ్ల వేడుకలు.. మరోవైపు అడ్డగింతలా?'

లఖింపుర్​లో పర్యటించేందుకు రాజకీయ నాయకులను అనుమతించకపోవడానికి కారణమేంటని కేంద్రాన్ని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​(Arvind Kejriwal News) ప్రశ్నించారు. లఖింపుర్ హింసాత్మక ఘటనకు కారణమైన కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించాలని దేశం కోరుకుంటోందని చెప్పారు.

  • 'రైతులపై వరుస దాడులు.. నియంత పాలనలో దేశం'

ప్రస్తుతం దేశంలో నియంత పాలన నడుస్తోందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News) విమర్శించారు. రైతులపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన​లో(Lakhimpur Kheri Incident) బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తమకు ప్రభుత్వం అనుమతించటం లేదని చెప్పారు.

  • పండుగ సీజన్​లో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ అదిరే ఆఫర్లు!

ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ దసరా ఆఫర్లు ప్రకటించింది. ఈ-కామర్స్​, ఇతర బ్రాండ్లతో ఒప్పందాల ద్వారా భారీ క్యాష్​ బ్యాక్​, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • అతడి విషయంలో రిస్క్​ తీసుకున్నా: రోహిత్​

రాజస్థాన్​ రాయల్స్​తో(MI Vs RR 2021) జరిగిన మ్యాచ్​లో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన కెప్టెన్​ రోహిత్​ శర్మ(rohit sharma ishan kishan). ఇషాన్​ కిషన్​ విషయంలో రిస్క్​ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. బౌలర్లందరూ కలిసికట్టుగా రాణించారని ప్రశంసించాడు. కాగా, తమ తర్వాతి మ్యాచ్​లో బాగా రాణించేందుకు శ్రమిస్తామని అన్నాడు రాజస్థాన్ కెప్టెన్​ సంజూ శాంసన్​.

  • Maa Elections 2021: ప్రకాశ్​రాజ్​పై రవిబాబు పరోక్ష విమర్శలు!

లోకల్​, నాన్​లోకల్(maa elections 2021)​ అనే విషయాన్ని పక్కనపెట్టి 'మా' ఎన్నికల్లో తెలుగువారినే అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కోరారు ప్రముఖ దర్శకుడు, నటుడు రవిబాబు. ఇప్పటికే చిత్రసీమలో చాలా మంది పొరుగువాళ్లు ఉన్నారని చెప్పిన ఆయన.. 'మా' అసోసియేషన్​ను(maa elections schedule) కూడా వారికే అప్పగిస్తామా? అంటూ పరోక్షంగా ప్రకాశ్ రాజ్​ను విమర్శించారు.

  • క్రిప్టో కరెన్సీతో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్​ కొనుగోలు!

రేవ్​ పార్టీ కేసులో(mumbai rave party bollywood) మరో విస్తుపోయే నిజం బయటకు వచ్చింది. క్రిప్టో కరెన్సీతో ఆర్యన్ ఖాన్(Aryan Khan Arrest) డ్రగ్స్​ కొనుగోలు చేసినట్లు మాదకద్రవ్యాల నిరోధక శాఖ అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.