- స్టేకు సుప్రీం నిరాకరణ
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కేసులో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కొత్తగా 218 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 218 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందిన 136 మందికి మహమ్మారి సోకినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం
ఏడాది పాలనలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.58 కోట్ల మందికి లబ్ధి చేకూర్చామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమరావతి ఎస్ఐ సస్పెన్షన్
అమరావతి ఎస్ఐ తనపై లైంగికదాడికి యత్నించాడని ఓ మహిళ గుంటూరు డీఎస్పీని ఆశ్రయించింది. విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వీడియో తీసిన ప్రాణం
ఉపాధి హామీ పనులు యంత్రాలతో చేయిస్తుండడాన్ని ఓ వ్యక్తి సెల్ఫోన్లో చిత్రీకరించాడు. దీనిపై ఆగ్రహించిన వైకాపా వర్గీయులు ఆ వ్యక్తిపై దాడికి దిగారు. దాడిలో తీవ్రగాయాల పాలైన సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండేళ్ల బాలుడు పిటిషన్
దిల్లీలోని ఓ రెండేళ్ల బాలుడు హైకోర్టును ఆశ్రయించాడు. లక్షణాలు లేని వైరస్ బాధితులకు పరీక్షలు నిర్వహించకూడదన్న ప్రభుత్వ నిర్ణయంతో తన ప్రాణాలకు ప్రమాదం ఉందని పిటిషన్ వేశాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అక్కడ నుంచే భారత్‌కు కరోనా
కరోనా భారత్‌కు ఎలా వచ్చిందనే అంశమై కీలక అంశాన్ని వెల్లడించింది బెంగళూరులోని ఐఐఎస్సీ. ఐరోపా, పశ్చిమాసియా నుంచే భారత్‌కు మహమ్మారి వచ్చి ఉంటుందని తేల్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవిడ్‌పై పోరుకు ఆవు యాంటీబాడీలు!
కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు ఆవుల్లోని యాంటీబాడీలు సాయపడుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్
విడాకులు తీసుకున్న మహిళలే.. కర్ణాటకకు చెందిన సురేశ్ టార్గెట్. డబ్బు కోసం వారికి వల వేయడం, అనంతరం ఆ డబ్బుతో పరారవ్వడం అతడి వృత్తి. ఇందుకు అతడు ఎంచుకున్న వేదిక మాట్రిమోనీ. చివరికి ఏమయ్యిందంటే..
- అనుమానమే
అగ్రరాజ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా యూఎస్ ఓపెన్‌లో పాల్గొనకూడదని ప్రముఖ ఆటగాడు జకోవిచ్ భావిస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- షకీలా సినిమాకు యూ సర్టిఫికేట్
'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం' సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని, యూ సర్టిఫికెట్ అందుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.