ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

author img

By

Published : Jun 9, 2020, 1:02 PM IST

.

1pm top news
1pm ప్రధాన వార్తలు
  • కాసేపట్లో సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

గన్నవరం విమానాశ్రయానికి తెలుగు సినీ ప్రముఖులు... చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేష్‌బాబు చేరుకున్నారు. వీరంతా మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌ను కలవనున్నారు. రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధిపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు

అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత నిర్దిష్ట సమయంలోనే కార్డులు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వారు వీరయ్యారు

వారంతా పిల్లలకు వ్యాయామం నేర్పించే ఉపాధ్యాయులు... ఇప్పుడు రైలు ప్రయాణికులకు సేవలందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో వీరి సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వలస కార్మికుల అంశంపై సుప్రీం కీలక తీర్పు

దేశంలో వలస కూలీలను గుర్తించి వారిని 15 రోజుల్లో స్వస్థలాలకు పంపాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 49 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కరోనా

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. తాజాగా ఒడిశాలోని 49మంది ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బందికి వైరస్​ నిర్ధరణ అయ్యింది. అంపన్​ తుపాను సమయంలో బంగాల్​లో సహాయక చర్యల్లో వీరందరూ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • స్టాక్ మార్కెట్ జోరు

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. మిడ్​ సెషన్​ ముందు సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా లాభంతో 34,664 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల వృద్ధితో 10,255 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుచేటు'

జార్జ్​ ఫ్లాయిడ్​ మృతికి నిరసనగా జరిగిన ఆందోళనల్లో భాగంగా వాషింగ్టన్​లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని దుండగులు అపవిత్రం చేశారు. తాజాగా దీనిపై స్పందించిన అధ్యక్షుడు ట్రంప్​.. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుచేటు అని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కిమ్​ అనూహ్య నిర్ణయం!

అమెరికా, ఉత్తర కొరియా మధ్య జరుగుతున్న అణు సంబంధిత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో కిమ్​ జోంగ్​ ఉన్​ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తప్పేముంది?

ఒకవేళ టీ20 ప్రపంచకప్​ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్​ నిర్వహించుకునేందుకు బీసీసీఐకి అధికారం ఉందని అన్నారు మైకేల్​ హోల్డింగ్​. దీంతో పాటు ఐసీసీ విధించిన బంతిపై ఉమ్మిరుద్దడం నిషేధాన్ని తాను సమర్థిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇవి బాలయ్య మైలురాయి చిత్రాలు

జానపదం.. పౌరాణికం.. యాక్షన్‌.. లవ్‌.. సోషియో ఫాంటసీ ఇలా జోనర్‌ ఏదైనా సరే ఆ కథలో, పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ. 60వ వసంతంలో అడుగుపెట్టబోతున్న బాలయ్యబాబు మైలురాయి చిత్రాలు చూసేద్దాం రండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.