తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వరుసగా రెండో రోజు కూడా పెరిగింది. 1500లకు పైగానే కేసులు నమోదవుతుండటం కాస్త ఆందోళన రేకిత్తిస్తోంది. అయితే పరీక్షల సంఖ్య పెంచడం కూడా కారణం కావొచ్చని అధికారులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకు 45,526 శాంపిల్స్‌ని పరీక్షించగా.. 1,637 మందికి పాజిటివ్ తేలింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,44,143కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
మంగళవారం ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,357కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,273 మంది కోలుకోగా..ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,24,686కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,100 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 15,335 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 292 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 44,39,856 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది..
ఇదీ చూడండి: