ETV Bharat / city

వైద్యుల చీటీ లేకుండానే ఆ మందులు విక్రయించొచ్చు.. - medicine sales without prescription

వైద్యుల చీటీ అవసరం లేకుండానే 16 రకాల ఔషధాలు విక్రయించడానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అనుమతించింది. ఈ మందును గరిష్ఠంగా అయిదు రోజుల వరకు వాడుకోవచ్చని తెలిపింది. అప్పటికీ జబ్బు లక్షణాలు తగ్గకపోతే వైద్యుణ్ని సంప్రదించాలని సూచించింది. ఔషధ నియంత్రణ సంస్థ వద్ద విక్రయాలకు అనుమతి పొందిన దుకాణదారులే వీటిని అమ్మాలని స్ప ష్టం చేసింది.

MEDICINES
MEDICINES
author img

By

Published : May 27, 2022, 3:13 PM IST

వైద్యుల చీటీ అవసరం లేకుండానే 16 రకాల ఔషధాలను విక్రయించడానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అనుమతించింది. ఔషధ నియంత్రణ సంస్థ వద్ద విక్రయాలకు అనుమతి పొందిన దుకాణదారులే వీటిని అమ్మాలని స్పష్టం చేసింది. రోగి సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని, అర్హులైన ఫార్మాసిస్టులే ఈ ఔషధాలను ఇవ్వాలని సూచించింది. ఈ మందులను గరిష్ఠంగా అయిదు రోజుల వరకు వాడుకోవచ్చని, అప్పటికీ జబ్బు లక్షణాలు తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపింది.

ఈ మేరకు గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఈ మందులను సొంతంగా వాడటం వల్ల హాని కలిగే అవకాశాల్లేవని, వైద్యఖర్చులు కూడా ఆదా చేసినట్లవుతుందని తెలిపింది. అయితే ఏదైనా పరిమితికి మించి వాడడం మంచిది కాదనీ, నిర్దేశిత గడువులోగా తగ్గకపోతే వైద్యుడి సలహా పొందాల్సిందేనని స్పష్టం చేసింది. గతంలో ఉన్న నిబంధనలకు ఇది తాజా సవరణగా పేర్కొంది. దీనిపై అభ్యంతరాలుంటే వచ్చే నెల 25 లోగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు పంపించాలంది. వాటిని పరిశిలించాక తుది నిర్ణయం వెల్లడిస్తామని, అప్పటినుంచీ సవరణ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

..

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.