తెలంగాణలో మరో 15వందల 54మందికి కరోనా నిర్ధరణ అయింది. ఒకే రోజు 7మంది వైరస్‌తో మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2లక్షల 19వేల 224కి చేరింది.
మహమ్మారితో ఇప్పటివరకు 12వందల 56 మంది బలయ్యారు. మరో 14 వందల35 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా.... మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య లక్షా 94వేల 653 మందికి చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 23వేల 203 యాక్టివ్ కేసులుండగా... 19వేల 251 మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 249 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి: వర్షాలు తగ్గినా కొనసాగుతోన్న వరద ఉద్ధృతి