తెలంగాణలో సోమవారం మరో 1550 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 9 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 926 కేసులను గుర్తించారు. మొత్తంగా కొవిడ్ పాజిటివ్ కేసులు 36,221కి చేరుకున్నాయి.
ఇప్పటివరకు కరోనాతో మొత్తం 365 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకుని 1,197 మంది ఇంటికెళ్లారు.ప్రస్తుతం 12,178 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మొత్తం మీద 23,679 మంది డిశ్చార్జయ్యారు.
ఇదీ చూడండి : ఎంసెట్ సహా...పలు ప్రవేశ పరీక్షలు వాయిదా: మంత్రి సురేశ్