కరోనా రెండో దశ తెలంగాణను చుట్టుముట్టేస్తోంది. మొదటి దశ కన్నా వేగంగా విస్తరిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో మరో 1,498 మంది కొవిడ్ బారిన పడగా.. వైరస్ సోకి ఆరుగురు మృతి చెందారు.
ప్రస్తుతం 10 వేలకు చేరువలో కరోనా క్రియాశీలక కేసులు ఉన్నాయి. 5,323 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 313 మంది కొవిడ్ బారినపడ్డారు. రాష్ట్రంలో సోమవారం రోజు 62,350 మంది కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,993 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచిస్తున్నా.. చాలా వరకు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇలానే కొనసాగితే.. సెకండ్ వేవ్ కరోనాను తెలంగాణ అధిగమించడం కష్టంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి: