రాష్ట్రంలో కొవిడ్ కేసులు(corona cases) తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 84,502 శాంపిల్స్ పరీక్షించగా.. 14,429మందికి కరోనా పాజిటివ్(corona positive)గా నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి 103 మృతి చెందారు. కొత్తగా 20,746 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
కరోనా మహమ్మారితో చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అత్యధికంగా 15 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే, విశాఖలో 10 మంది, నెల్లూరులో 9, అనంతపురంలో 8, తూర్పుగోదావరి 8, కృష్నా 8, గుంటూరు 7, విజయనగరం 7, శ్రీకాకుళం 6, కడప, కర్నూలు జిల్లాల్లో నలుగురు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఇద్దరు మరణించినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.90 కోట్లకు పైగా శాంపిల్స్ పరీక్షించగా.. 16,57,986 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వీరిలో 14,66,990మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 10,634మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,80,362 యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నాయి.
ఇదీ చదవండి