ETV Bharat / city

తెలంగాణలో 120 మంది పోలీసులకు కరోనా

తెలంగాణలో పోలీస్ శాఖను కరోనా కలవరపెడుతోంది. ప్రస్తుతం మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో అధికారులు, సిబ్బంది సహా 120 మందికి పైగా వైరస్‌ బారినపడ్డారు. లాక్‌డౌన్‌ అమలు, వలస కూలీల తరలింపు, కంటైన్‌మెంట్‌ జోన్లపై నిఘా, ఆసుపత్రుల వద్ద బందోబస్తు తదితర అంశాల్లో పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో పలువురు వైరస్‌ బారిన పడ్డారు.

120-police-tested-corona-positive-in-three-police-commissionerate

author img

By

Published : Jun 12, 2020, 11:21 AM IST

కరోనా మహమ్మారి తెలంగాణ పోలీసులపై ప్రతాపం చూపిస్తోంది. వైరస్‌ బారిన పడుతున్న సిబ్బంది సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 20 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఒక ఏసీపీ, ఇద్దరు ఎస్‌ఐలు సహా మరో 17 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉన్నారు. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 120 మందికి పైగా సోకినట్లయింది. లాక్‌డౌన్‌ అమలు, వలస కూలీల తరలింపు, కంటైన్‌మెంట్‌ జోన్లపై నిఘా, ఆసుపత్రుల వద్ద బందోబస్తు తదితర అంశాల్లో పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో పలువురు వైరస్‌ బారిన పడ్డారు. కొందరికి ఎలా సోకిందో అంతుచిక్కడం లేదు.

15మంది హోం క్వారంటైన్​

ఆ 3 ఠాణాలలో.. పశ్చిమ మండలంలో కీలకమైన బంజారాహిల్స్‌ ఠాణాలో ఇప్పటికే ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా సోకగా గురువారం ఓ ఎస్సైతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లు, హోంగార్డుకు పాజిటివ్‌గా తేలింది. 15 మందిని హోం క్వారంటైన్‌ చేశారు. నమూనాలను తీసి పరీక్షలకు పంపారు. పాజిటివ్‌గా తేలిన ఓ కానిస్టేబుల్‌ పలుమార్లు ఠాణాకు వచ్చి వెళ్లడం ద్వారా వ్యాపించి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

ఎస్సైకి కరోనా

ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కరోనా బారిన పడగా ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రికి తరలించారు. ఇదే ఠాణాలో పనిచేస్తున్న మరో కానిస్టేబుల్‌(30)కు పాజిటివ్‌ వచ్చింది. ఇక మంగళ్‌హాట్‌ ఠాణాలో ఓ కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. నిజాంపేట శ్రీనివాసకాలనీ హౌసింగ్‌ సొసైటీ రోడ్డు నంబరు-7లో ఉంటున్న ఓ కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ వచ్చింది. ఆయన హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ డీసీపీ కార్యాలయంలో పనిచేస్తున్నారు.

ఫోన్లు చేసి వాకబు

కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మూడు కమిషనరేట్ల పోలీస్‌ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వెంటనే యూనిట్‌ అధికారికి తెలియజేయాలని సూచించారు. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా హోం క్వారంటైన్‌లోకి వెళ్లేలా కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే సిబ్బందిని, సందర్శకులను అనుమతించాలని స్పష్టం చేశారు. రోజు కనీసం 500-600 మంది ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు.

పోలీసు స్టేడియంలో 41 మందికి పరీక్షలు

హైదరాబాద్​లోని శివకుమార్‌లాల్‌ పోలీసు స్టేడియంలో పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో గురువారం 41 మంది సిబ్బంది పాల్గొన్నారు. గత రెండు వారాల్లో సుమారు 400 మందికి పైగా సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 80 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

కేసులు.. కమిషనరేట్‌

  • 140.. హైదరాబాద్‌
  • 12.. సైబరాబాద్‌
  • 4.. రాచకొండ

ఇదీ చదవండి

అచ్చెన్నాయుడి కిడ్నాప్​కు జగన్ బాధ్యత వహించాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.