ETV Bharat / city

APTOPNEWS ప్రధానవార్తలు11AM

author img

By

Published : Aug 22, 2022, 10:58 AM IST

.

APTOPNEWS
ప్రధానవార్తలు11AM

  • భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి, 10 వేల దిగువకు కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 9,531 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 36 మంది కరోనాతో మరణించారు. 24 గంటల వ్యవధిలో 11,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.59 శాతం వద్ద ఉంది. యాక్టివ్ కేసులు 0.22 శాతం ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.15 శాతం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కుల జాడ్యాన్ని తరిమికొట్టాల్సిందే, యువత ముందుకు రావాలి

రాజస్థాన్‌లో తాగునీటి కుండను తాకినందుకు టీచర్‌ తీవ్రంగా కొట్టడంతో ఓ దళిత బాలుడు మృత్యువాతపడిన ఘటనపై ఆ రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుల వ్యవస్థ జాడ్యాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరముందని లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ ఉద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బస్సు ఛార్జీల విషయంలో ఆర్టీసీ మాయాజాలం, ఎందుకో తెలుసా

ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వెబ్‌సైట్లో ఆర్టీసీ మాయాజాలం ప్రదర్శిస్తోంది. చార్జీల ధరల విషయంలో ప్రయాణికులను గందరగోళానికి గురి చేస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ కంటే తక్కువ టికెట్ ధర చూపించి వారికంటే ఎక్కువే బాదేస్తోంది. ఓక్కో సీటుపై వంద రూపాయలు ఆ పైనే బాదుడుతో ఆర్టీసీ బస్సు చార్జీ ధర ప్రైవేటు ట్రావెల్స్‌నూ మించిపోతోంది. ప్రభుత్వ రవాణా సంస్థలో ఈ తరహా విధానంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భర్తకు మత్తుమందు ఇచ్చి అంతమొందించిన భార్య, 59రోజుల తర్వాత వెలుగులోకి

కట్టుకున్న భార్యే భర్తను కడతేర్చి, సహజ మరణంగా చిత్రీకరించింది. కుటుంబసభ్యులు, బంధువులు అదే నిజమని నమ్మారు. తాము బయటపడ్డామని నిందితులు ఊపిరి పీల్చుకున్నారు. సెల్‌ఫోన్‌లోని సమాచారంతో మృతుడి తండ్రికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించగా, విచారణలో గుట్టు బయటపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మూడో ప్రత్యామ్నాయం ఉండాలన్న జనసేన అధినేత పవన్​

రాష్ట్రంలోనూ మూడో ప్రత్యామ్నాయం ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వైకాపా, తెదేపాకు కొమ్ము కాసేందుకు తాము సిద్దంగా లేమని వెల్లడించారు. వైకాపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాకూడదనేదే తమ విధానమని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ఎన్నికల వ్యూహం చెబుతానని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేడు ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ, పోలవరంపై చర్చించే అవకాశం

ముఖ్యమంత్రి జగన్​ దిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధాని మోదీతో ఈరోజు ఉదయం చర్చించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌, సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ములను కలవనున్నట్లు సమాచారం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సైలెంట్​గా దూసుకెళ్లే సూపర్​సోనిక్ విమానాలు

మనిషి ప్రయాణాలు పెరుగుతున్నాయి. వ్యాపారాలు, ఇతర అవసరాల కోసం సుదూర పర్యటనలు చేసే వారి సంఖ్య నానాటికీ అధికమవుతోంది. ఇదే సమయంలో ప్రయాణ సమయాన్ని తగ్గించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ దిశగా ఉన్న మార్గం సూపర్‌సోనిక్‌ వేగం. కానీ ఇంత వడిగా దూసుకెళ్లే విమానాల నుంచి ఉత్పన్నమయ్యే కర్ణ కఠోరమైన శబ్దం నేలమీదున్నవారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ ఇబ్బందిని దూరం చేసే దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అడుగులు వేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 150 తగ్గి ప్రస్తుతం రూ. 53,200 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.360 తగ్గి ప్రస్తుతం రూ.57,000 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేటి నుంచే ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌, సవాల్‌కు సై

కామన్వెల్త్‌ క్రీడల్లో అదిరే ప్రదర్శనతో జోరు మీదున్న భారత షట్లర్లు.. మరో ప్రతిష్ఠాత్మక సమరానికి సిద్ధమయ్యారు. అత్యుత్తమ ప్లేయర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండే ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌ సవాలుకు సై అంటున్నారు. సోమవారమే ఈ మెగా టోర్నీకి తెరలేస్తుంది. గాయంతో సింధు దూరమవడం దెబ్బే. మరి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌, ప్రణయ్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బుల్లితెరపై సల్మాన్​ రూట్​లో బాలయ్య, నాగ్, వీళ్ల రెమ్యునరేషన్​ తెలిస్తే మైండ్​ బ్లాకే

సిల్వర్​స్క్రీన్​పై అదరగొట్టే అగ్రతారలు టీవీ షోల్లో సందడి చేస్తే వచ్చే కిక్కే వేరు. సామాన్య ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ టీవీలకు అతుక్కునేలా చేయడంలో ఈ షోలు విజయవంతం అవుతున్నాయి. వెండితెర వేల్పులుగా వెలిగిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, ఎన్టీఆర్‌ లాంటి అగ్రహీరోలు ఈ టీవీ రియాలిటీ షోల్లో అదరగొట్టి కుటుంబ ప్రేక్షకుల ప్రేమాభిమానాలూ పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.