ETV Bharat / city

ప్రధానవార్తలు @11AM - breaking news

..

ప్రధానవార్తలు
TOPNEWS
author img

By

Published : Jul 11, 2021, 11:01 AM IST

  • Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..రాగల మూడ్రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందన్నారు. దీని ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంపై ఉంటుందని తెలిపారు. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పంచలింగాల చెక్ పోస్టు వద్ద 7 కిలోల బంగారం పట్టివేత

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న కారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న... 7 కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. రూ 3 కోట్లు విలువైన బంగారంతో పాటు రూ. 10 లక్షల నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Chittoor: నేడు యర్రావారి పాలెంలో కత్తి మహేశ్​ అంత్యక్రియలు

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన కత్తి మహేశ్​ అంత్యక్రియలు..చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం యర్రావారిపాలెంలో నేడు జరుగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పీలేరులో భూ ఆక్రమణ : ఎట్టకేలకు అధికార యంత్రాంగంలో కదలిక

వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వం భూముల ఆక్రమణ పీలేరు పట్టణంలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార పార్టీ పెద్దల అండతో స్థానిక నేతలు ఆక్రమణలకు పాల్పడ్డారని తెదేపా నేతలు ఆరోపిస్తుండగా....అధికార పార్టీ నేత స్థానిక శాసనసభ్యుడు భూ దందా నిగ్గు తేల్చమంటూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Corona cases: దేశంలో కొత్తగా 41,506 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 41,506 కరోనా కేసులు(Corona cases) నమోదయ్యాయి. వైరస్​ ధాటికి మరో 895 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆధార్​' చూపిన మార్గం- 10 ఏళ్ల తర్వాత ఇంటికి!

ఆధార్ నమోదు(Aadhaar card).. పదేళ్ల క్రితం తప్పిపోయిన ఓ దివ్యాంగ బాలుడిని తన తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. అతని జీవితానికి ఆధారంగా నిలిచింది. అసలు ఆ బాలుడు ఎలా తప్పిపోయాడు? ఇన్నాళ్లు ఎక్కడున్నాడు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చెరలో పౌరస్వేచ్ఛ- విముక్తి కలిగేదెన్నడు?

ఆదివాసీ హక్కులు సహా అక్రమ అరెస్టులపాలైన వారి విముక్తి కోసం నిరంతరం పోరాడిన స్టాన్ స్వామి చివరకు విచారణ ఖైదీగానే మృతిచెందడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మెక్​డీ 'ఫ్రైస్​'- బిల్​గేట్స్​కి సంబంధం ఏంటి?

దిగ్గజ వ్యాపారవేత్త బిల్​గేట్స్​కు.. మెక్​డీలో లభించే ఫ్రెంచ్​ ఫ్రైస్​కు ఓ సంబంధం ఉంది. రుచికరంగా ఉండే ఈ ఫ్రైస్​కు తయారీకి కావాల్సిన బంగాళదుంపలను గేట్స్​కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తారని ఓ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పాక్​పై ఇంగ్లాండ్ సిరీస్​ విన్​- విండీస్ చేతిలో ఆసీస్​ చిత్తు

ఇంగ్లాండ్​-పాకిస్థాన్(England vs Pakisthan)​ మధ్య జరిగిన రెండో వన్డేలో స్టోక్స్​ సేన విజయకేతనం ఎగురవేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్​ను 2-0తో కైవసం చేసుకుంది ఇంగ్లాండ్. విండీస్-ఆసీస్(West Windies vs Australia) మధ్య జరిగిన మరో టీ 20 మ్యాచ్​లో కరీబియన్​ జట్టు విజయదుందుంభి మోగించింది. ఐదు టీ20ల సిరీస్​లో 2-0తో ముందంజ వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈ దిగ్గజ దర్శకుడి ఒక్కో సినిమా.. ఒక్కో అద్భుతం!

ప్రతివారంలానే ఈసారి కూడా మరో స్టార్ గురించిన ఆసక్తికర విషయాలతో మీ ముందుకొచ్చేశాం. ఆయన దిగ్గజ దర్శకుడు కాశీనాధుని విశ్వనాథ్. వెండితెరపై ఆయన చేసిన ప్రయోగాలేంటి? దానికి ప్రజల నుంచి వచ్చిన ఆదరణేంటి? తదితర అంశాలతో కూడిన స్పెషల్ స్టోరీ మీకోసం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.