ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

..

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11 AM
author img

By

Published : Jul 22, 2022, 10:58 AM IST

  • పింగళి వెంకయ్య కుమార్తె కన్నుమూత... పలువురి సంతాపం
    Pingali Venkaiah daughter: జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. సీతామహాలక్ష్మి మృతికి పలువురు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • GPF money: జీపీఎఫ్‌ డబ్బు రాక.. కుమార్తె పెళ్లి వాయిదా వేసిన ఉద్యోగి
    GPF money: దరఖాస్తు చేసినా జీపీఎఫ్‌ డబ్బు రాకపోవడంతో ఓ ఉద్యోగి... తన కుమార్తె పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఖాతాలో ఉన్న సుమారు రూ.15 లక్షల్లో రూ.11 లక్షల వరకు సొమ్ము వస్తుందనే ఆశతో ఈ నెల 24న పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. సమయం దగ్గర పడినా నగదు రాలేదు. చేసేదిలేక వారం పాటు వాయిదా వేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బూట్లు, యూనిఫాం లేకుండానే విద్యా కానుక కిట్లు... అడిగితే..?
    'పిల్లలు బడిలోకి అడుగు పెడుతుండగానే విద్యా కానుకను వారి చేతుల్లో పెడుతున్నాం' అన్న సీఎం జగన్​ మాటలు నీటిమీద రాతలుగానే మిగిలాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. బూట్లు, యూనిఫాం లేకుండానే విద్యా కానుక కిట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదని... వచ్చే నెలాఖరు వరకు ఎదురుచూడాల్సిందే! అని సమాధానం ఇస్తున్నారని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తిరిగి చెల్లించినా ఆగని రుణయాప్​ వేధింపులు.. తాత, మనవడు ఆత్మహత్య
    Loan app: ఆన్​లైన్​ రుణ యాప్​ ఆగడాలు ఆగడంలేదు. అడగకుండానే రుణాలు ఇచ్చి... అనంతరం గడువుకు ముందే తిరిగి చెల్లించాలని లేదంటే.. పరువు తీస్తామని వేధించడంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా రుణం తిరిగి చెల్లించినా... వేధింపులు ఆపకపోవడంతో తాతా, మనవడు ప్రాణాలు తీసుకున్నారు. ఎక్కడంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి
    CBSE 12th Result 2022: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. ఈ ఉదయం సీబీఎస్‌ఈ బోర్డు ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు results.cbse.nic.in లేదా cbse.gov.in ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మహిళా కానిస్టేబుల్​ కుటుంబంలో ముగ్గురు మృతి.. బయట డోర్​ లాక్​.. దుర్వాసనతో..!
    ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. మృతుల్లో మహిళా కానిస్టేబుల్, ఆమె తల్లి, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తాంత్రికుడు. ఆ దారుణం రాజస్థాన్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీ కుట్ర భగ్నం.. 2 కిలోల యురేనియంతో చిక్కిన స్మగ్లర్లు.. 15 మంది అరెస్ట్​
    Uranium Smuggling India: ప్రమాదకర యురేనియంను భారత్​లోకి స్మగ్లింగ్​ చేస్తున్న ముఠాను ఇండో-నేపాల్​ సరిహద్దు వద్ద అడ్డుకున్నారు పోలీసులు. 2 కేజీల యురేనియం సహా ఇతర అనుమానస్పద వస్తువులు లభ్యమయ్యాయి. మొత్తం 15 మందిని అరెస్టు చేశారు పోలీసులు. పూర్తి
    వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐటీ రిటర్న్స్​ దాఖలుకు జులై 31 ఆఖరు.. ఇలా చేస్తున్నారా మరి?
    it return filing: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఈ నెల 31 ఆఖరి తేదీ. కొన్నేళ్లుగా రిటర్ను దాఖలులో పలు మార్పులు వచ్చాయి. వెల్లడించాల్సిన ఆదాయాలు, ఖర్చుల వివరాలు పెరిగాయి. ఆదాయపు పన్ను విభాగం వీటన్నింటినీ ఒకేచోటకు తీసుకొచ్చి, సులభంగా రిటర్నుల సమర్పణకు అవసరమైన చర్యలనూ తీసుకుంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోహ్లీ, రోహిత్‌, ధోనీ రికార్డ్స్​పై కన్నేసిన ధావన్​!
    Dhawan record: వెస్టిండీస్​తో వన్డే సిరీస్ జరగనున్న నేపథ్యంలో​ తాత్కాలిక కెప్టెన్​ శిఖర్​ ధావన్​ అరుదైన రికార్డులపై కన్నేశాడు. అవేంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • OTT Movies: ఓటీటీలో సినిమా.. లాభమా? నష్టమా?
    OTT Release: ఇకపై థియేటర్‌లోకి వచ్చిన 50 రోజుల తర్వాతే ఓటీటీల్లోకి సినిమా విడుదల చేయాలని ఇటీవలే టాలీవుడ్​ నిర్మాతలు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ సమయాన్ని 70 రోజులకు పెంచాలని ప్రస్తుతం నిర్మాతలు పట్టుబడుతున్నారు. మరి దీనివల్ల లాభమా? నష్టమా? తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.