ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@11AM - 11AM TOP NEWS

ప్రధాన వార్తలు@11AM

11AM TOP NEWS
ప్రధాన వార్తలు@11AM
author img

By

Published : Dec 24, 2021, 11:01 AM IST

  • OMICRON CASE IN AP: రాష్ట్రంలో మూడో ఒమిక్రాన్ కేసు నమోదు

రాష్ట్రంలో మూడో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మహిళ భర్త, పిల్లలకు కరోనా నెగటివ్‌ వచ్చిందని.. మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

  • చలి చంపుతున్న వేళల్లో.. పర్యాటకులందరూ మన్యంలో..!

విశాఖ మన్యంలోని పర్యాటకులను, ప్రజలను చలి చంపేస్తోంది. మంటలు వేసుకున్నా చలికి గజగజా వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా ఆ ప్రాంతమంతా చిమ్మ చీకట్లు అలముకున్నాయి. అత్యల్పంగా లంబసింగిలో 3. 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

  • Land Donated for Hospital : సీతమ్మ పెద్ద మనసమ్మ.. రూ.3 కోట్ల విలువైన భూదానం

Land donated for hospital: పశ్చిమగోదావరి జిల్లా వెలివెన్ను గ్రామానికి చెందిన బూరుగుపల్లి సీతమ్మ.. తన ఔదార్యం చాటుకున్నారు. గ్రామంలో తలపెట్టిన ఆసుపత్రి నిర్మాణానికి రూ. 3 కోట్ల విలువైన 7ఎకరాల భూమిని దానం చేసి ఉదారతను చాటుకున్నారు.

  • Gold price today: ఏపీ, తెలంగాణలో భారీగా తగ్గిన బంగారం ధర

Gold Price Today: బంగారం ధర శుక్రవారం భారీగా తగ్గింది. పది గ్రాముల మేలిమి పుత్తడి రూ.960 మేర దిగొచ్చింది. కిలో వెండి ధర రూ.100 మేర పెరిగింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • India covid cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

India covid cases: దేశంలో కొత్తగా 6,650 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 374 మంది మరణించారు. గురువారం 57,44,652 మందికి కొవిడ్​ టీకా డోసులు అందించారు. మరోవైపు.. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 358కి చేరింది.

  • నిందితునిపై పోలీసుల కాల్పులు- మధ్యలో టీనేజర్ బలి

Police kill teen girl: ఓ స్టోర్​లో నిందితునిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో అకారణంగా ఓ టీనేజర్ బలైపోయింది. డ్రెస్సింగ్​ రూంలో ఉన్న ఆమెకు తూటా తాకగా ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలో ఈ ఘటన జరిగింది.

  • ఐపీఓ నామ సంవత్సరం.. 2021లో రూ.1.18 లక్షల కోట్లు సమీకరణ!

2021లో ఐపీఓల మోత మోగిపోయింది! ఎన్నడూ లేనంతగా నిధుల సమీకరణ జరిగింది. ఇప్పటివరకు 63 కంపెనీలు మార్కెట్లోకి వచ్చి.. రూ. 1.18లక్షల కోట్లను సమీకరించుకున్నాయి. 2020లో ఇది రూ. 26వేల కోట్లుగా ఉండటం గమనార్హం. లిస్టింగ్‌ రోజున భారీ లాభాలు వస్తుండటంతో, అధికులు దరఖాస్తు చేశారు. అందువల్లే ఈ ఏడాది ఐపీఓలు వరుస కట్టాయి.

  • 'నా వ్యాఖ్యలు అశ్విన్​ను బాధించి ఉంటే సంతోషమే'

Ravi Shastri on Ashwin: కుల్​దీప్​ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలకు అశ్విన్​ బాధపడి ఉంటే అది తనకు సంతోషమే అన్నాడు టీమ్​ఇండియా మాజీ కోచ్​ రవిశాస్త్రి. అందువల్లే అశ్విన్​ ఆటతీరు మెరుగైందని పేర్కొన్నాడు.

  • Shyam Singha Roy Review: 'శ్యామ్​ సింగరాయ్​' ఎలా ఉందంటే?

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం చేసిన 'శ్యామ్ సింగరాయ్​' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ఏమంటున్నారో తెలుసుకోండి.

  • రామ్ పోతినేని భామ.. సొగసుల ముద్దుగుమ్మ!

చాక్లెట్​ బాయ్ రామ్ పోతినేని​ సరసన లింగుస్వామి దర్శకత్వంలో రానున్న చిత్రంలో నటిస్తోంది అక్షర గౌడ. నేడు ఈ డస్కీ బ్యూటీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె విశేషాలను చూద్దాం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.