- పెరుగుతున్న వరద
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండల గ్రామాలు వరద ముప్పులో ఉన్నాయి. నిత్యావసరాల కోసం పడవలపైనే స్థానికులు ప్రయాణం సాగిస్తున్నారు. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 2రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూ.200 కోట్లు డిపాజిట్ చేయండి!
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యబోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో రెండు బోర్డులకు చెరో రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలని అవి కోరుతున్నాయి. ఈ మేరకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లు వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు లేఖలు పంపారు. బోర్డుల నిర్వహణకు రూ.200 కోట్ల చొప్పున మూలనిధిగా ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'దర్యాప్తు వేగవంతం చేయండి'
రాష్ట్రపతికి, ప్రధానికి వైకాపా ఎంపీలు విడివిడిగా లేఖలు రాశారు. రఘురామరాజు మరో విజయ్ మాల్యాగా మారకుండా ఆయన కంపెనీలపై దర్యాప్తు వేగవంతం చేయాలని అందులో పేర్కొన్నారు. ఆయన సంస్థల్లో రూ.941.71 కోట్ల మోసం జరిగిందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సంబంధం లేకుండా విచారించొచ్చు
సీఎం జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీబీఐ కేసుల తరువాతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులపై విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌లపై శుక్రవారం ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో 39 వేల కరోనా కేసులు
దేశంలో కొత్తగా 39,097 మందికి కరోనా(Covid 19 India) సోకింది. మరో 35 వేల మంది కోలుకోగా.. 546 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రపంచం గ్రహించింది
కరోనాతో మనావతా సంక్షోభం ఎదురవుతున్న ప్రస్తుత సమయంలో బుద్ధుడి బోధనలు ఎంతో అనుసరించదగినవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ బోధనల శక్తిని ప్రపంచమంతా గ్రహించిందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ము కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరాలోని ఓ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగినట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 44కు చేరిన మృతుల సంఖ్య
మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 44కు చేరింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది ఎన్డీఆర్ఎఫ్ బృందం. మరో 50 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆర్చరీలో క్వార్టర్స్‌కు
ఒలింపిక్స్‌లో తొలిరోజు పోటీల్లో భారత్ ఆర్చర్లు అదరగొట్టారు. శనివారం జరిగిన మిక్స్డ్ టీమ్ విభాగంలో దీపికా కుమారి-ప్రవీణ్ జాదవ్.. చైనీస్ తైపీపై 5-3 తేడాతో గెలిచి, క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వార్టర్స్‌లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా తలపడనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దంపతులకు పండంటి బిడ్డ
'సార్పట్ట' సినిమాతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న హీరో ఆర్య తండ్రయ్యాడు. అతడి భార్య, హీరోయిన్ సాయేషా సైగల్‌కు శుక్రవారం పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని హీరో విశాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.