ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

ప్రధాన వార్తలు @ 11 AM

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11 AM
author img

By

Published : Jul 22, 2021, 11:00 AM IST

  • వర్షాలు విస్తారంగా...!

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో వానలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది.ఏపీ తీరప్రాంత జిల్లాల్లో గంటకు 20-30 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రభుత్వం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది. విశాఖకు 2, పోలవరానికి 2 భద్రాచలం 1, కర్ణాటకకు 4 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్రైస్తవ మతంలోకి ప్రజలను మారుస్తున్నారని వచ్చిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ 15 రోజుల్లోగా నివేదిక అందజేయాలని సీఎస్​కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పాఠ్య పుస్తకాలు లేకుండానే

ఇంటర్ పాఠ్య పుస్తకాలు లేకుండానే.. విద్యార్థులకు ఆన్​లైన్ తరగతులు చెబుతున్నారు. దాదాపు 2.50 లక్షల మంది పిల్లలకు పుస్తకాలను అందించాల్సి ఉన్నా... ఈ ఏడాది ప్రింటింగ్​కు ఇవ్వడంలో జాప్యం కారణంగా ముద్రణ పూర్తి కాలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇళ్లను తొలగించేందుకు అధికారుల యత్నం

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అమరారెడ్డినగర్‌లో రాత్రికిరాత్రే అధికారులు ఇళ్లు తొలగించటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇళ్లలో ఉన్న సామాన్లు బయటకు తీసేందుకు కూడా సమయమివ్వలేదని.. కూల్చివేత ఆపాలంటూ విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆ రోజులు రావాలి'

ప్రాంతీయభాషల్లో ఇంజినీరింగ్‌ కోర్సులు నిర్వహించడం.. విద్యార్థుల పాలిట వరంగా మారుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మాతృభాషల్లో చదువు నేర్చుకోవడంవల్ల విద్యార్థులకు సంగ్రహణ, అవగాహన శక్తి పెరుగుతుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 41 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 41,383 మందికి కరోనా సోకింది. 38,652 మంది కోలుకోగా.. 507 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 41,78,51,151 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కీలక ప్రకటన

పక్షుల నుంచి మానవులకు హెచ్‌5ఎన్‌1(బర్డ్​ ఫ్లూ) వైరస్ వ్యాప్తి చాలా అరుదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పష్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే పౌల్ట్రీకి దగ్గర్లో పనిచేసే వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సొరంగంలో చిక్కుకొని 13 మంది మృతి

నిర్మాణ పనులు కొనసాగుతున్న సొరంగంలోకి వరదనీరు ప్రవేశించగా.. చిక్కుకుపోయిన కార్మికుల్లో 13 మంది మృతిచెందారు. చైనాలో ఈ ఘటన జరిగింది. మరోవైపు.. చైనాలో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా పరిస్థితులు 'అత్యంత తీవ్రం'గా మారాయని ఆ దేశ అధ్యక్షుడు జిన్​పింగ్​ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎందుకు కొరుకుతారో తెలుసా?

జులై 23(శుక్రవారం) నుంచి ఒలింపిక్స్ (Tokyo olympics)​ జరగనుంది. అయితే ఈ విశ్వక్రీడల్లో విజేతలు పతకాన్ని(Olympic medals) పంటి కింద పెట్టి కొరుకుతూ ఫొటోలకు పోజులిస్తుంటారు? ఇలా ఎందుకు చేస్తారంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ముస్లిం గెటప్​ అందుకే..!

'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి ఆసక్తికర విషయాల్ని రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్, రామ్​చరణ్​ పాత్ర విశేషాల్ని వెల్లడించారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.