ETV Bharat / city

ప్రధాన వార్తలు @11 AM

.

11am top news
ప్రధాన వార్తలు @11 AM
author img

By

Published : Jul 2, 2020, 11:03 AM IST

  • జైలులో పెట్టాలనే..

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు డిశ్చార్జిపై తెదేపా నేతలు మండిపడ్డారు. నిబంధనలకు వ్యతిరేకంగా, బలవంతంగా జీజీహెచ్​ నుంచి డిశ్చార్జ్ చేశారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం వైకాపా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • మృత్యు కుంట

అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లలిద్దరూ నీటి కుంటలో పడి మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లా నల్లగుట్లపల్లిలో జరిగింది. అమ్మానాన్నలు పొలం వెళ్లగా ఆడుకునేందుకని కుంట దగ్గరకు వెళ్లినవారు ప్రమాదవశాత్తూ అందులోపడి మరణించారు. విషయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు పిల్లల కోసం గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరులనూ కంటతడి పెట్టిస్తోంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • వేతనాలు అప్పుడే

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల వేతనాలు శనివారం తర్వాతేనని... ప్రభుత్వ సలహాదారు అజేయకల్లం స్పష్టం చేశారు. చరిత్రలో తొలిసారి ద్రవ్యవినిమయ బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకపోవడం వల్లే ఇలా జరిగిందని వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • చిరువ్యాపారుల పె'న్నిధి'

పట్టణాల్లోని చిరువ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా కుదేలైన వారిలో పునరుత్తేజం నింపేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వనిధి) పథకం ద్వారా వారికి 7 శాతం వడ్డీ రాయితీతో రూ.10 వేల రుణాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • కరోనా ఉద్ధృతి

కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. ఇప్పటివరకు 19 వేల 148 మంది మరణించారు. ఒక్కరోజులోనే మరో 434 మంది కొవిడ్​కు బలయ్యారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • పోలీసుల అరెస్టు

తమిళనాడు తండ్రీకొడుకుల లాకప్​డెత్​ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేశారు సీబీ- సీఐడీ అధికారులు. ఇందులో ముగ్గురు ఎస్సైలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తూత్తుకుడి సాతంకుళం ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • పుల్​ జోష్​

అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ మార్కెట్లు లాభాలతో దూసుకెళ్తున్నాయి. అన్​లాక్​ 2.0 ప్రారంభం కావడం, ఆర్​బీఐ కీలక సంస్కరణలు ప్రకటించడం కూడా దీనికి కలిసొచ్చింది. ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 266 పాయింట్లు లాభపడి 35 వేల 681 వద్ద కొనసాగుతోంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 'అధ్యక్షుడినైతే భారత్​కే ప్రాధాన్యం'

అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే తమ విదేశాంగ విధానంలో భారత్​కు అధిక ప్రాధాన్యమిస్తామని డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్​ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఓ ఎన్నికల ఫండ్​ రైజింగ్ కార్యక్రమంలో తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • లాక్​డౌన్​ సహాయం

కరోనా లాక్​డౌన్​ టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి పరోక్షంగా ఉపయోగపడిందని తెలిపాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ ఏబీ డివిలియర్స్​. ఈ విరామ సమయంలో అతడు రిఫ్రెష్​ అవుతాడని అన్నాడు. దీని వల్ల కోహ్లీ ప్రదర్శన మరింత మెరుగవుతుందని అభిప్రాయపడ్డాడు డివిలియర్స్​. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • రైతు పాత్రలో లెజెండ్​

అగ్రకథానాయకుడు బాలకృష్ణ.. తన కొత్త సినిమాలో రైతుగా కనిపించనున్నారట. దీనికి మాస్ చిత్రాల దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించనున్నారని సమాచారం. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.