తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. వీరందరినీ ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులకు తరలించారు. నమూనాలు సేకరించి హైదరాబాద్ పంపారు. విశాఖ ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో ఐదుగురు, శ్రీకాకుళం రిమ్స్‌లో ముగ్గురు, కాకినాడ, ఏలూరు, విజయవాడలో ఒక్కొక్కరు అనుమానిత లక్షణాలతో చేరారు.
విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిలోనే ఎక్కువశాతం లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. విశాఖలో చేరిన ఐదుగురిలో ముగ్గురు ఒకే కుటుంబసభ్యులు. వీరు ఇటీవలే మలేషియా విహారయాత్రకు వెళ్లి తిరిగి వచ్చారు. మరో ఇద్దరు బహ్రెయిన్ నుంచి వచ్చిన వారు. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చేరిన వారంతా యువకులే. వీరిలో రోగ లక్షణాలు లేకపోయినా... విదేశాల నుంచి తిరిగి వచ్చినందున ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరారు. విజయవాడ, కాకినాడ ఆస్పత్రిలో చేరిన వారు సైతం ఇటీవలే విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చారు.
రాష్ట్రంలో 11 కరోనా అనుమానిత కేసులు! - ఏపీలో కరోనా
రాష్ట్ర ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటి వరకు 11 అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. వారిని ప్రత్యేక వార్డులకు తరలించి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. నమూనాలను హైదరాబాద్‌కు పంపారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిలోనే ఎక్కువ శాతం ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు.