Student Died in school: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక బాలుడు మృతిచెందాడు. కృష్ణానగర్‌లోని సాయికృప పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు క్లాస్‌రూంలో సరదాగా పేపర్‌తో క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో నలుగురు విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. కోపంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఈ ఘర్షణలో మన్సూర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి గమనించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. మన్సూర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:'కేంద్ర పథకాలను తనవిగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని.. ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం'