ETV Bharat / city

Omicron Cases in AP: రాష్ట్రంలో మరో 10 ఒమిక్రాన్‌ కేసులు నమోదు.. - ఏపీలో కొత్తగా ఒమిక్రాన్ కేసులు

Omicron Cases in AP
Omicron Cases in AP
author img

By

Published : Dec 29, 2021, 3:29 PM IST

Updated : Dec 30, 2021, 3:31 AM IST

15:25 December 29

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 16 ఒమిక్రాన్‌ కేసులు

Omicron Cases in AP: వేగంగా వ్యాప్తిచెందే  కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు...రాష్ట్రంలోనూ పెరుగుతున్నాయి. ఒక్కరోజే 10 కొత్త కేసులు వెలుగు చూడటం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా డోన్‌లో భార్యాభర్తలిద్దరికీ ఒమిక్రాన్ నిర్థరణైంది. గుంటూరు జిల్లా తెనాలిలో తొలికేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 16కి చేరింది. ఈ మేరకు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.

కర్నూలు జిల్లాలో భార్యాభర్తలిద్దరికీ ఒమిక్రాన్

రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతూ వస్తోంది. కర్నూలు జిల్లా డోన్‌లో..ఈ కొత్త రకం కరోనా ఇద్దరిలో వెలుగుచూసిందని అధికారులు నిర్ధరించారు. పట్టణంలోని కొత్తపేటకు చెందిన దంపతులిద్దరూ ఇటీవల దుబాయ్ నుంచి వచ్చారు. వీరికి తొలుత కరోనా నిర్ధరణవగా జ్వరం ఎంతకూ తగ్గలేదు. అధికారులు మళ్లీ పరీక్షలు చేయగా దంపతులిద్దరికీ ఒమిక్రాన్ రకం  సోకినట్లు తేలింది. బాధితులు ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళనకు గురికావొద్దని సూచించారు.

తెనాలిలో.....తొలి ఒమిక్రాన్ కేసు
గుంటూరు జిల్లా తెనాలిలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. చెంచుపేటకు చెందిన బాధితుడు ఈనెల 18న నైజీరియా నుంచి వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో 21న బాధితుడి శాంపిళ్లూ సేకరించారు. పరీక్షలో పాజిటివ్‌ రావడంతో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. అక్కడ ఒమిక్రాన్‌గా తేలింది. బాధితుడి కుమార్తెకూ కరోనా నిర్ధరణవడంతో ఆమె శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. తెనాలి జిల్లా ఆస్పత్రిలో బాధితుడికి చికిత్స అందిస్తామన్నారు.

వ్యాప్తిని బట్టి చర్యలు

రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 16కు పెరగ్గా బాధితులంతా 50 ఏళ్లలోపు వయస్కులేనని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో వ్యాప్తికి అనుగుణంగా కొవిడ్‌ ఆంక్షలు కఠినతరం చేస్తామని అధికారులు అంటున్నారు. జిల్లాల్లో 5 శాతం కేసులు నమోదైతే జాగ్రత్తలు.. పది శాతం నమోదైతే..కంటైన్‌మెంట్, ఇతర కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
 
9 నెలలు దాటితేనే బూస్టర్‌

AP Omicron cases: రాష్ట్రంలో 60 ఏళ్లు దాటినవారు 29 లక్షలు, ఆరోగ్య సిబ్బంది 4.89 లక్షల మంది చొప్పున ఉన్నారు. వీరితోపాటు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకాల (బూస్టర్‌ డోసు) పంపిణీని వచ్చే నెల 10న ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో రెండు డోసుల టీకా పొంది 9 నెలలు (39 వారాలు) గడిచిన వారికి మాత్రమే బూస్టర్‌ డోస్‌ వేయనున్నారు. 60 ఏళ్లు వయసుండి, దీర్ఘకాలిక వ్యాధులు కలిగినవారు టీకా పొందాలనుకున్న రోజున వైద్యుల సలహా తీసుకొని, టీకా తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. ప్రభుత్వం ఎంపిక చేసిన కేంద్రాల్లో వీరందరికీ ఉచితంగా టీకా ఇస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిషీల్డ్‌ 38.81 లక్షలు, కొవాగ్జిన్‌ 7.63 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ఈ నెలాఖరులోగా కొవిషీల్డ్‌ను రెండో డోసుగా పొందాల్సినవారు 26 లక్షలు, కొవాగ్జిన్‌ పొందాల్సినవారు 4.36 లక్షల మంది ఉన్నారని అధికారులు తెలిపారు.

బాలబాలికలకు 3 నుంచి తొలి డోసు

రాష్ట్రంలో 15-18 ఏళ్ల మధ్య ఉన్న బాలబాలికలకు కరోనా టీకా తొలి డోసు పంపిణీ వచ్చే నెల 3న ప్రారంభం కానుంది. ఈ వయసువారు రాష్ట్రంలో 24.41 లక్షల మంది ఉన్నారు. వీరికి కొవాగ్జిన్‌ టీకా వేస్తారు. ఒకటో తేదీ నుంచి కొవిన్‌ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు. మూడో తేదీ నుంచి నేరుగా వెళ్లి వ్యాక్సిన్‌ కోసం నమోదు చేసుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేసి టీకాలు వేస్తారు.

దేశంలోనూ ఒమిక్రాన్​ కలవరం..
Omicron Cases in India: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 781కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల్లో 241 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వైరస్ విస్తరించినట్లు పేర్కొంది.

  • దిల్లీలో: 238
  • మహారాష్ట్రలో : 167
  • గుజరాత్​లో : 73
  • కేరళలో : 65
  • తెలంగాణలో: 62
     
Vaccination in India
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం మరో 64,61,321 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,43,15,35,641 కు చేరింది.

Covid world cases
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భయపెడుతున్నాయి. ఒక్కరోజే 12,19,556 కేసులు వెలుగులోకి వచ్చాయి. 6,570 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • అమెరికాలో కొత్తగా 3.12లక్షల కేసులు నమోదయ్యాయి. 1,811 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8,42,161కు పెరిగింది.
  • బ్రిటన్​లో 1.29 లక్షల కేసులు వెలుగులోకివచ్చాయి. మరో 18 మంది వైరస్​కు బలయ్యారు.
  • ఫ్రాన్స్​లో 1.79 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 290 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,23,188కు చేరింది.
  • స్పెయిన్​లోనూ కరోనా తీవ్రంగానే ఉంది. కొత్తగా 99,671 కేసులు బయటపడ్డాయి. 114 మంది మృతి చెందారు.
  • ఇటలీలో కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదవుతోంది. కరోనా తీవ్రతకు మరో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 76 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం మరణాల సంఖ్య 1,36,955కు చేరుకుంది.

ఇదీ చదవండి

15 ప్యూన్​, వాచ్​మ్యాన్​ ఉద్యోగాలు.. దరఖాస్తులు 11 వేలు!

Last Updated : Dec 30, 2021, 3:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.