ETV Bharat / business

Upcoming EV SUV Cars In India 2023 : రూ.10లక్షల్లోపే ఎస్​యూవీ ఎలక్ట్రిక్​ కార్లు.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 450కి.మీ. రేంజ్!​ - మారుతీ సుజుకి ఫ్రాంక్స్ ఈవీ కారు

Upcoming Ev SUV Cars In India 2023 Under 10 Lakhs : కేవలం రూ.10లక్షల లోపు ధరతో.. ప్రముఖ కంపెనీలకు చెందిన ఎస్​యూవీ కార్లు త్వరలో మార్కెట్​లోకి విడుదల కానున్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏవి? వాటి ధర ఎంత? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

upcoming ev SUV cars in india 2023 under 10 lakhs
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 3:53 PM IST

Upcoming EV SUV Cars In India 2023 Under 10 Lakhs : ప్రస్తుతం భారత్​లో ఎలక్ట్రిక్​ వాహనాల కొనుగోళ్లు బాగానే జరుగుతున్నాయి. అందులో ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ వాహనాలకు మంచి డిమాండ్​ ఉంది. కానీ ధర కాస్త ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మారుతీ, టాటా, హ్యుందాయ్ వంటి కంపెనీలు.. కేవలం రూ.10లక్షల లోపే ఎస్​యూవీ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్​లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఆ కార్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసకుందాం.

టాటా పంచ్​ ఈవీ..
Tata Punch EV Price : టాటా పంచ్​ ఈవీ మోడల్​ కారును త్వరలోనే మార్కెట్​లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది టాటా కంపెనీ. 2023 చివర్లో లేదంటే 2024 సంవత్సర ప్రారంభంలో గానీ మార్కెట్​లోకి ఈ కారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కారును ఎంతో ఆకర్షణీయంగా రూపొందించింది టాటా కంపెనీ. ఎక్కువ భద్రత ప్రమాణాలతో కారును అందుబాటులోకి తీసుకువస్తోంది. దీని ధర రూ.10లక్షలోపే ఉండే అవకాశం ఉంది.

ఈ కారు రెండు పవర్​ట్రైన్స్ ఆప్షన్​లలో అందుబాటులో ఉంటుంది..

  1. 19.2kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన మోడల్ కారు​. ఇది 110Nm టార్క్​తో 61BHP పవర్ జనరేట్ చేస్తుంది.
  2. 24kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన మోడల్​ కారు. ఇది 114Nm టార్క్​తో 74BHP పవర్ జనరేట్ చేస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీ..
Hyundai Exter EV : ఇటీవలే మార్కెట్​లోకి ఆరంగ్రేటం చేసిన హ్యుందాయ్ ఎక్స్‌టర్​కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. వాహనాల అమ్మకాలు సైతం అదే తరహాలో జరిగాయి. కొద్ది రోజుల్లో విడుదలయ్యే హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎలక్ట్రిక్​ కారుకు కూడా అదే మాదిరి స్పందన ఉంటుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీ కారు.. 2024 సంవత్సరం మధ్యలో మార్కెట్​లోకి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని టెస్టింగ్​ ప్రారంభ దశలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ఈవీ కార్లకు హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీ గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధర కూడా రూ.10 లక్షల లోపే ఉండొచ్చని సమాచారం.

ఈ కారుకు సంబంధించి పూర్తి వివరాలను హ్యుందాయ్ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కాకపోతే దీని బ్యాటరీ సామర్థ్యం 25kWh నుంచి 30kWh ఉండొచ్చని మార్కెట్​ నిపుణల అభిప్రాయం. దీంతో బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 300 నుంచి 350 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చని తెలుస్తోంది.

మారుతి సుజుకీ ఫ్రాంక్స్ ఈవీ..
Maruti Suzuki Fronx EV : 2030 నాటికి మొత్తం ఆరు కొత్త ఎలక్ట్రిక్​ కార్లను మార్కెట్​లోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది మారుతి సుజుకీ. ఇప్పటికే అందులో కొన్నింటిని విడుదల చేసింది. తమ ప్లానింగ్​లో భాగంగానే 2023 సంవత్సరం కూడా ఫ్రాంక్స్ ఈవీ కారును లాంఛ్​ చేసేందుకు సిద్ధమైంది మారుతీ సుజుకీ. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను సుజుకీ ఇంకా వెల్లడించలేదు. మార్కెట్​ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫ్రాంక్స్ ఈవీ వాహనం ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 400 నుంచి 450 కిలో మీటర్లు ప్రయాణం చేస్తుందని సమాచారం. ఈ కారు ధర రూ.10లక్షల లోపే ఉండే అవకాశం ఉన్న కారణంగా ఈ సెగ్మెంట్​లో మంచి​ ఆప్షన్​ అయ్యే సూచనలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Honda New Bike launch : అదిరే ఫీచర్లతో.. హోండా ఎస్​పీ 125, బజాజ్​ పల్సర్​ ఎన్​150 బైక్స్ లాంఛ్​.. ధర ఎంతంటే?

Honda Activa Limited Edition Scooter Launch 2023: హోండా నుంచి సరికొత్త స్కూటీ.. అదిరిపోయే ఫీచర్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.