ETV Bharat / business

ట్విట్టర్ ఖేల్ ఖతం.. ఆ కంపెనీలో విలీనం చేసిన మస్క్.. అంతా గుట్టుగానే..

author img

By

Published : Apr 11, 2023, 4:39 PM IST

Updated : Apr 11, 2023, 5:22 PM IST

ట్విట్టర్ అనే కంపెనీ మనుగడలో లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. ట్విట్టర్​ను ఎక్స్ యాప్​లో విలీనం చేసినట్లు అమెరికాలోని ఓ కోర్టుకు వెల్లడించింది.

Twitter merges with x app
Twitter merges with x app

ట్విట్టర్​ను మరో కంపెనీలో విలీనం చేశారు ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్. ఎక్స్ అనే ఎవ్రీథింగ్ యాప్​లో ట్విట్టర్​ను కలిపేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ట్విట్టర్ అనే స్వతంత్ర కంపెనీ మనుగడలోనే లేదని కోర్టు ఫైలింగ్​లో పేర్కొంది. "ట్విట్టర్ కంపెనీని ఎక్స్ కార్పొరేషన్​లో విలీనం చేశాం. ట్విట్టర్ ఇప్పుడు లేదు. ఎక్స్ కార్పొరేషన్ అనే ప్రైవేటు సంస్థ.. నెవాడలో ఉంది. కాలిఫోర్నియాలోని శాన్​ఫ్రాన్సిస్కోలో ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది" అని తన ఫైలింగ్​లో వివరించింది.

ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ తుది దశలో ఉండగానే ఎక్స్ యాప్​నకు సంబంధించి తన ప్రణాళికలను వివరించారు మస్క్. ఎక్స్ యాప్​ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకే ట్విట్టర్​ను కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టంగా వెల్లడించారు. 'ఎక్స్ అనేది ఎప్పటికీ నా దీర్ఘకాల వ్యాపార ప్రణాళికగా ఉంటుంది. ఎక్స్ యాప్​ రూపకల్పనను వేగవంతం చేసేందుకు ట్విట్టర్ ఉపయోగపడుతుంది. ట్విట్టర్​ను కొనుగోలు చేస్తే.. ఎక్స్ సంస్థ 3-5 ఏళ్లు ముందుకు వెళ్తుంది' అని గతేడాది అక్టోబర్​లో ట్వీట్ చేశారు మస్క్.

twitter-everything-app
ఎక్స్ యాప్ గురించి గతంలో మస్క్ చేసిన ట్వీట్లు

వీచాట్ లాంటి యాప్ కోసం..
చైనాలో ఉండే వీచాట్​ తరహాలో ఓ యాప్​ను రూపొందించాలని మస్క్ సుదీర్ఘ కాలంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఆన్​లైన్​లో అన్ని పనులు చేసుకునే విధంగా ఓ సూపర్ యాప్​ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. అమెరికాకు ఓ సూపర్ యాప్ అవసరం ఉందంటూ గతంలో ఓ పాడ్​కాస్ట్​లో వివరించారు.

"చైనా ప్రజలకు వీచాట్ ఉంది. ఆ యాప్ అన్ని పనులు చేస్తుంది. ట్విట్టర్, పేపాల్ వంటి కంపెనీలు అందించే సేవలన్నీ అందులోనే చేసుకోవచ్చు. యాప్ ఇంటర్​ఫేస్ సైతం బాగుంటుంది. కానీ, చైనా అవతల అలాంటి యాప్​లు లేవు. అన్ని పనులు చేసే ఓ సూపర్ యాప్ అవసరం అమెరికాకు ఉంది. ట్విట్టర్​నే సూపర్ యాప్​గా మార్చాలి. లేదంటే కొత్తది ఏదైనా క్రియేట్ చేయాలి. ఎలాగైనా సూపర్ యాప్​ను అందుబాటులోకి తేవాలి."
-ఎలాన్ మస్క్

1999లోనే ఎక్స్ పేరుతో ఓ ఆన్​లైన్ బ్యాంకును ఏర్పాటు చేశారు మస్క్. అనంతరం జరిగిన పరిణామాల్లో దాన్ని పేపాల్​లో విలీనం చేశారు. తర్వాత ఎక్స్.కామ్ అనే డొమైన్​ను కొనుగోలు చేశారు. ఎక్స్ కంపెనీని స్వతంత్రంగా అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే డొమైన్​ను కొనుగోలు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా, ట్విట్టర్​ను ఎక్స్ యాప్​లో విలీనం చేసి సూపర్ యాప్ రూపొందించే దిశగా దూసుకెళ్తున్నారు.
ట్విట్టర్​ను 44 బిలియన్ డాలర్లకు మస్క్ కొనుగోలు చేశారు. స్పామ్ అకౌంట్లను తగ్గించేందుకు, ఫ్రీ స్పీచ్​ను ప్రోత్సహించేందుకు ట్విట్టర్​ను కొనుగోలు చేస్తున్నట్లు అప్పట్లో వెల్లడించారు.

Last Updated : Apr 11, 2023, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.