ETV Bharat / business

Tata Motors Price hike : టాటా మోటార్స్​ వాహన ధరల పెంపు​.. జులై 16 లోపు కొంటే బెనిఫిట్స్​ ఇవే! - tata motors car price hike 2023

Tata Motors Vehicle Price hike : టాటా మోటార్స్​ కంపెనీ త్వరలో ప్యాసెంజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. సీఎన్​​జీ వాహనాలతో పాటు విద్యుత్​ వాహనాల ధరలు కూడా 0.6 శాతం మేర పెరగుతాయని స్పష్టం చేసింది. అయితే జులై 16 లోపు వాహనాలను బుక్​ చేసుకున్న వారికి మాత్రం ప్రైస్​ ప్రొటెక్షన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది.

Tata Motors Vehicle Price hike
Tata Motors to hike prices of passenger vehicles from Jul 17
author img

By

Published : Jul 3, 2023, 1:09 PM IST

Tata Motors Passenger Vehicles Price Hike : ప్రముఖ ఆటోమొబైల్​ దిగ్గజం టాటా మోటార్స్​.. ప్యాసెంజర్​ వాహనాల ధరలను జులై 17 నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. సాధారణ (ఐసీఈ)వాహనాలతో పాటు ఎలక్ట్రిక్​ వాహనాల ధరలు కూడా 0.6 శాతం మేర పెరగనున్నట్లు స్పష్టం చేసింది. టాటా మోటార్స్​కు చెందిన అన్ని మోడల్స్​, వేరియంట్స్​కు కూడా ఇదే విధానం వర్తిస్తుందని వెల్లడించింది. వాహనాల తయారీ ఖర్చులు పెరిగినందునే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్​ కంపెనీ పేర్కొంది.

జులై 16 లోపు బుక్​ చేసుకుంటే..
త్వరలో వాహనాల ధరలు పెంచనున్నప్పటికీ.. జులై 16 లోపు ఎవరైతే టాటా మోటార్స్ వాహనాలను బుక్​ చేస్తారో, వారికి మాత్రం ప్రైస్​ ప్రొటెక్షన్​ కల్పిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే వారికి 2023 జులై 31లోపు వాహనాన్ని డెలివరీ కూడా చేస్తామని పేర్కొంది. ప్రస్తుతం టాటా మోటార్స్..​ పంచ్​, నెక్సాన్​, హారియర్​ సహా అనేక మోడల్స్​ ప్యాసెంజర్​ వాహనాలను మార్కెట్​లో అమ్ముతోంది.

అమ్మకాలు పెరిగాయ్​!
టాటా మోటార్స్​ 2023 మే నెలలో దేశీయంగా 80,383 యూనిట్లు అమ్మినట్లు తెలిపింది. గతేడాది ఇదే సమయంలో 79,606 యూనిట్లు మాత్రమే సేల్​ చేసింది. దీనిని చూస్తే ఇప్పుడు టాటా మోటార్స్ వాహనాలకు డిమాండ్​ పెరిగిందని స్పష్టం అవుతోంది. గతేడాది కంటే ఈ సంవత్సరం టాటా మోటార్స్ డొమెస్టిక్​ ప్యాసెంజర్ వాహనాల ధరలు (ఎలక్ట్రిక్​ వాహనాల ధరలు సైతం) 5 శాతం మేర పెరగడం గమనార్హం.

రికార్డ్​ సేల్స్​
విద్యుత్​ వాహనాల అమ్మకాల్లో టాటా మోటార్స్​ రికార్డ్​ సృష్టించింది. ఈ త్రైమాసికంలో అత్యధికంగా 19,346 యూనిట్లు సేల్​ చేసింది. ఇది గతేడాదితో పోలిస్తే 105 శాతం ఎక్కువ. త్వరలో పండగ సీజన్​ ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్యాసెంజర్​ వాహనాలకు మరింత డిమాండ్​ పెరుగుతుందని టాటా మోటార్స్ అంచనా వేస్తోంది.

సెకెండ్ ప్లేస్​లో
భారతదేశంలో ప్యాసెంజర్​ వాహనాల అమ్మకాల్లో మారుతి సుజుకి ప్రథమ స్థానంలో ఉంది. దాని తరువాత స్థానంలో టాటా మోటార్స్ ఉంది. అందుకే భారతదేశంలోని మైక్రో మార్కెట్​ను లక్ష్యంగా చేసుకొని.. టాటా మోటార్స్ తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి సన్నాహాలు చేస్తోంది.

ప్రొడక్షన్​ పెంచుతోంది
పెరుగుతున్న డిమాండ్​కు అనుగుణంగా ఉత్పత్తి పెంచుకునేందుకు టాటా మోటార్స్​ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఫోర్డ్​ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన గుజరాత్​లోని సనంద్​ ఫ్యాక్టరీలో ప్రస్తుతం సంవత్సరాలనికి 3 లక్షల యూనిట్లు తయారుచేస్తోంది. త్వరలోనే దానిని 4,20,000 యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే 600 మంది నిపుణులను నియమించుకుంది.

భారీ లాభాలు
సీఎన్​జీ, ఈవీ వాహనాల మార్కెట్​పై దృష్టిపెట్టిన టాటా మోటార్స్​ 2023 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.47,900 కోట్ల మేర రెవెన్యూ సంపాదించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.