ETV Bharat / business

Slice Card వాడుతున్నారా?.. ఇక ఆ కార్డులు పనిచేయవ్​!

ఆర్‌బీఐ నిబంధనల నేపథ్యంలో స్లైస్‌ కార్డు తన ప్రీపెయిడ్‌ కార్డు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నవంబరు చివరి నుంచి ఈ కార్డులు లావాదేవీల వినియోగానికి పనికిరావని పేర్కొంది.

slice card-will-no-longer-lend-through-prepaid-card

author img

By

Published : Oct 29, 2022, 9:55 PM IST

Slice Card : ఆర్‌బీఐ నిబంధనల నేపథ్యంలో స్లైస్‌ కార్డు తన ప్రీపెయిడ్‌ కార్డు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నవంబరు చివరి నుంచి ఈ కార్డులు లావాదేవీల వినియోగానికి పనికిరావని పేర్కొంది. ఈ మేరకు తమ వినియోగదారులకు ఈ-మెయిల్స్‌ పంపుతోంది. ఇందులో భాగంగా నవంబరులో ఈ కార్డులను తాత్కాలికంగా బ్లాక్‌ చేస్తున్నట్లు తెలిపింది.

ఆర్‌బీఐ తాజా నిబంధనల ప్రకారం.. స్లైస్‌ తరహా కంపెనీలు ఇకపై రుణ జారీ గానీ, తిరిగి చెల్లింపులుగానీ నేరుగా ఖాతాదారుడి బ్యాంకు ఖాతా నుంచే జరపాలి. నవంబరు 30తో ఈ గడువు ముగియనుంది. ఆర్‌బీఐ నిర్ణయంతో స్లైస్‌, యూని కార్డ్స్‌, లేజీపే వంటి సంస్థలపైనా ప్రభావం ఉంటోంది. ఈ నేపథ్యంలో స్లైస్‌ కార్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, నవంబరు చివరి నాటికి కొత్త రూపంలో అందుబాటులోకి వస్తాయని స్లైస్‌ తమ వినియోగదారులకు పేర్కొంది.

ఇకపై స్లైస్‌ ఇవ్వబోయే రుణాలు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని తెలిపింది. ప్రస్తుతం ఉన్న స్లైస్‌ కార్డును తమ డబ్బులు లోడ్‌ చేసుకుని రోజువారీ పేమెంట్స్‌ కోసం వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అలాగే 'స్లైస్‌ మినీ' పేరిట ఓ ప్రీపెయిడ్‌ అకౌంట్‌ తీసుకురాబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా 'స్లైస్‌ బారో' పేరిట క్రెడిట్‌ కూడా ఇవ్వనుంది..ఖాతాదారుడి ఎలిజిబిలిటీ మేరకు ఎంత కావాలో ఎంటర్‌ చేస్తే చాలు.. ఆ మొత్తం బ్యాంకు అకౌంట్‌లో జమవుతుంది. యూపీఐ పేమెంట్స్‌ కోసం 'స్లైస్‌ యూపీఐ' ఆప్షన్‌ను కూడా తీసుకురాబొతున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.