ETV Bharat / business

SBI RD Vs Post Office RD.. రెండింట్లో ఏది బెటర్​ ఆప్షన్​?

SBI RD Vs Post Office RD : మనం సంపాదించిన డబ్బును మదుపు చేసేందుకు అందుబాటులో ఉన్న బెస్ట్​ ఇన్వెస్ట్​మెంట్ స్కీమ్స్​లో ఆర్​డీ(రికరింగ్​ డిపాజిట్​) ఒక్కటి. ఎస్​బీఐ ఆర్​డీ , పోస్ట్​ ఆఫీస్ ఆర్​డీ రెండూ మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే ఈ ​రెండింటిలో ఏది బెస్ట్​ ఆప్షనో ఇప్పుడు చూద్దాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 8:21 AM IST

SBI RD VS Post Office RD Which Recurring Deposit Scheme Offers Better Interest Rates
SBI RD Vs Post Office RD Which Is Better

SBI RD Vs Post Office RD : దేశంలో డబ్బును ఆదా చేసుకునేందుకు అనేక మార్గాలున్నాయి. కొందరు ఫిక్స్​డ్​ డిపాజిట్లలో జమ చేస్తే, మరికొందరు మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేస్తారు. అలాగే మరికొందరు ఏమాత్రం రిస్క్​ లేని పథకాల్లో మదుపు చేసేందుకు మొగ్గు చూపిస్తుంటారు. అలాంటి కోవలోనిదే రికరింగ్​ డిపాజిట్​ స్కీమ్​​.

ప్రస్తుతం ఈ రికరింగ్​ డిపాజిట్​ స్కీమ్​ను దేశంలో వివిధ బ్యాంకులతో పాటు ఇండియన్​ పోస్ట్​ ఆఫీసులు కూడా అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్​ ఎస్​బీఐ కూడా ఈ స్కీమ్​ను తమ కస్టమర్ల కోసం అందిస్తోంది. మరో వైపు ఇండియన్ పోస్ట్ కూడా ఆర్​డీ డిపాజిట్లను అందిస్తోంది. మరి ఎస్​బీఐ అందించే రికరింగ్​ డిపాజిట్​ వడ్డీ రేట్లు, తపాలా శాఖ ఆఫర్​ చేస్తున్న ఇంట్రెస్ట్​ రేట్స్​( Post Office RD Vs SBI RD )ను బేరీజు వేసుకుంటే.. ఏది బెటర్​ ఆప్షన్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

రికరింగ్​ డిపాజిట్​ అంటే ఏమిటి..?
What Is Recurring Deposit : రికరింగ్​ డిపాజిట్స్​ అనేవి ఓ ప్రత్యేకమైన టర్మ్​ డిపాజిట్లు. వీటి సేవలు దేశంలోని వివిధ బ్యాంకులతో పాటు పోస్ట్​ ఆఫీసుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా డిపాజిట్​ స్కీమ్స్​.. వినియోగదార్లు ప్రతినెలా నిర్దేశిత మొత్తాన్ని బ్యాంకులో లేదా తపాలా కార్యాలయంలో జమ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తాయి. ఫలితంగా ఆర్​డీ ఖాతాలు తెరచినవారు రెగ్యులర్​గా ఫిక్స్​డ్​ ఇంట్రెస్ట్​ రేట్​ పద్ధతిలో ఆదాయాన్ని పొందవచ్చు. ఈ వడ్డీ రేట్లు అనేవి బ్యాంకు, ఎన్​ఎఫ్​బీసీల నిబంధనలకు అనుగుణంగా మారుతుంటాయి.

ఉదాహరణకు.. మీరు 10 సంవత్సరాల కాలవ్యవధితో ఏడాదికి రూ.20వేల ఫిక్స్​డ్​ అమౌంట్​తో రికరింగ్​ డిపాజిట్​ ఖాతాను తెరిచారనుకోండి. అప్పుడు మీరు ఎంచుకున్న సమయానికి(మెచ్యురిటీ) మొత్తం రూ.2,40,000లను ఆర్​డీలో జమచేస్తారు. దీనిపై మీకు 5శాతం వడ్డీ లభిస్తుంది. ఫలితంగా మెచ్యూరిటీ సమయానికి మీకు రూ.7,15,083 వడ్డీ వస్తుంది. అంటే టర్మ్​ ముగిసేసరికి మొత్తంగా రూ.31,15,083 లంప్సమ్​ను మీరు పొందవచ్చు.

ఎస్​బీఐ ఆర్​డీ స్కీమ్​..
SBI RD Scheme 2023 : ఎస్​బీఐ ప్రస్తుతం 1 నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధితో కూడిన రికరింగ్​ డిపాజిట్​ సర్వీసెస్​ను తమ వినియోగదారులకు అందిస్తుంది. ఈ పథకం కింద సీనియర్​ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీని ఆందిస్తోంది. మరి సాధారణ కస్టమర్లకు ఈ బ్యాంక్​ అందిస్తున్న వడ్డీ రేట్ల వివరాలిలా ఉన్నాయి.

1-2 సంవత్సరాలు6.80 శాతం
2-3 సంవత్సరాలు7.00 శాతం
3-4 సంవత్సరాలు6.50 శాతం
5-10 సంవత్సరాలు6.50 శాతం

ఎస్​బీఐ నిబంధనల ప్రకారం, ఈ పథకం కింద సీనియర్​ సిటిజన్లు అదనంగా 0.50 శాతం వడ్డీని అధికంగా పొందుతున్నారు. దీని ప్రకారం..

1-2 సంవత్సరాలు7.30 శాతం
2-3 సంవత్సరాలు7.50 శాతం
3-4 సంవత్సరాలు7.00 శాతం
5-10 సంవత్సరాలు7.00 శాతం

పోస్ట్​ ఆఫీస్​ ఆర్​డీ..!
ప్రస్తుతం దేశంలో తపాలా శాఖ(పోస్ట్​ ఆఫీస్​) అందిస్తున్న రికరింగ్​ డిపాజిట్​ స్కీమ్​ కాలవ్యవధి గరిష్ఠంగా 5 సంవత్సరాలు మాత్రమే. అది కూడా ఈ పథకం కింద మదుపు చేసే డబ్బుకు స్థిరంగా ఒకే రకమైన వడ్డీ వస్తుంది. కాగా, ప్రస్తుతం పోస్ట్​ ఆఫీసులు చెల్లిస్తున్న వడ్డీ శాతం 6.5 శాతంగా ఉంది. అయితే బ్యాంకులు ముఖ్యంగా సీనియర్​ సిటిజన్​లకు అందిస్తున్న అదనపు వడ్డీ పద్ధతిని పోస్ట్​ ఆఫీసుల్లో గమనించలేము.

మరి ఏది బెస్ట్ ఆర్​డీ​..?
SBI RD Vs Post Office RD Which Is Better : రికరింగ్​ డిపాజిట్​ సేవలందిస్తున్న ఎస్​బీఐ, పోస్ట్​ ఆఫీసులతో పోలిస్తే.. ఎస్​బీఐ ఆర్​డీలను బెస్ట్​ ఆప్షన్​గా సూచిస్తున్నారు ఫైనాన్షియల్​ ఎక్స్​పర్ట్స్​. ఎందుకంటే ముఖ్యంగా సీనియర్​ సిటిజన్​లకు ఎస్​బీఐ ఆర్​డీలు సాధారణ కస్టమర్లకు ఇచ్చే వడ్డీకి అదనంగా 0.50 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. ఇవి వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎంతో ఉపయోగపడనున్నాయి. చివరగా మీ ఆర్థిక సామర్థ్యంతో పాటు అవసరాలకు అనుగుణంగా ఏది బెస్ట్​ ఆప్షనో బేరీజు వేసుకొని ఇన్వెస్ట్​ చేస్తే సరిపోతుందంటున్నారు బ్యాంకింగ్​ నిపుణులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.