ETV Bharat / business

SBI Mobile Handheld Device Service : ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్​.. చిన్న రిక్వెస్ట్​తో​.. ఇంటి వద్దకే బ్యాంకింగ్​ సేవలు.. - ఎస్​బీఐ హ్యాండ్​హెల్డ్ డివైజ్ ప్రయోజనాలు

SBI Mobile Handheld Device Service In Telugu : ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్​. ఎస్​బీఐ ఇటీవలే తమ ఖాతాదారుల కోసం 'మొబైల్​ హ్యాండ్​హెల్డ్​ డివైజ్​' సర్వీసును ప్రారంభించింది. దీని ద్వారా సీనియర్​ సిటిజన్లు, దివ్యాంగులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి.. వారి ఇంటి వద్దకే వచ్చి బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పిస్తోంది. అందుకే దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

SBI Doorstep Banking Services
SBI Mobile Handheld Device Service
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 4:50 PM IST

SBI Mobile Handheld Device Service : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేడు బ్యాంక్ అకౌంట్లు ద్వారా.. లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వ పథకాల ప్రతిఫలాలను, పెన్షన్​లను అందిస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాలను తప్పనిసరిగా కలిగి ఉంటున్నారు. సాధారణంగా వీరు వయోభారం చేత లేదా దివ్యాంగులు అవ్వడం మూలంగా.. బ్యాంక్​లకు వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతిసారీ వీరికి ఎవరో ఒకరు తోడు ఉండాల్సి ఉంటుంది. పైగా అనారోగ్య సమస్య వస్తే.. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని.. భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్​ అయిన ఎస్​బీఐ 'మొబైల్ హ్యాండ్​హెల్డ్​ డివైజ్'​ సర్వీస్​లను ప్రారంభించింది. దీని ద్వారా ఎస్​బీఐ కస్టమర్లు తమ ఇంటి వద్దనే బ్యాంకింగ్ సౌకర్యాలు పొందడానికి వీలు అవుతుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు, అనారోగ్య సమస్యలతో ఇళ్లు కదలలేని వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

"సమాజంలోని అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో లేనివారికి.. బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కల్పించడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. అందులో భాగంగానే హ్యాండ్​హెల్డ్ డివైజ్​ను ఆవిష్కరించడం జరిగింది. దీని ద్వారా నేరుగా కస్టమర్ ఇంటివద్దకే వెళ్లి బ్యాంకింగ్​ సౌకర్యాలు కల్పిస్తాం."
- దినేశ్ కుమార్ ఖారా, ఎస్​బీఐ ఛైర్మన్​

5 డోర్​స్టెప్​ బ్యాంకింగ్ సర్వీసెస్​
SBI Doorstep Banking Services : స్టేట్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఈ మొబైల్ హ్యాండ్​హెల్డ్​ డివైజ్​ ద్వారా ఐదు కీలకమైన బ్యాంకింగ్​ కార్యకలాపాలు చేసుకోవచ్చు. అవి ఏమిటంటే..

  1. నగదు డిపాజిట్​
  2. నగదు ఉపసంహరణ
  3. నిధుల బదిలీ
  4. బ్యాలెన్స్ ఎక్వైరీ
  5. నగదు లావాదేవీల చిట్టా (మినీ స్టేట్​మెంట్​)

వాస్తవానికి ఎస్​బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ల వద్ద నిర్వహించే మొత్తం ఆర్థిక లావాదేవీల్లో 75% కంటే ఎక్కువగా.. పైన పేర్కొన్న బ్యాంకింగ్​ సేవలే ఉంటాయి.

బ్యాంకింగ్ సేవల విస్తరణే లక్ష్యంగా..
SBI Handheld Device Core Banking Service List : ఎస్​బీఐ త్వరలో హ్యాండ్​హెల్డ్​ డివైజ్​ ద్వారా.. సామాజిక భద్రతా పథకాలు, అకౌంట్ ఓపెనింగ్​, నగదు చెల్లింపులు (రెమిటెన్స్​), కార్డ్​-బేస్డ్ సర్వీసులను కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి స్టేట్ బ్యాంక్​ ఆఫ్ ఇండియాలో సాధారణ ఖాతాదారులు మాత్రమే కాకుండా, అనేక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఖాతాదారులు కూడా ఉన్నారు. అందుకే వీరికి కూడా.. అన్ని బ్యాంకింగ్ సౌకర్యాలను కల్పించాలని ఎస్​బీఐ నిర్ణయం తీసుకుంది.

ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు..
SBI Banking Services For FI Customers : సాధారణంగా బ్యాంకులకు లేదా కస్టమర్ సర్వీస్ పాయింట్ల వద్దకు వెళ్లడం సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి కాస్త కష్టంగా ఉంటుంది. అలాగే సాధారణ కస్టమర్లకు కూడా.. ఎక్కడో ఉన్న బ్యాంక్​ బ్రాంచ్​లకు తరచూ వెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఎస్​బీఐ మొబైల్ హ్యాండ్​హెల్డ్ డివైజ్​ను ఆవిష్కరించింది. దీని ద్వారా కస్టమర్ ఇంటి వద్దకే కియోస్క్ బ్యాంకింగ్​ను తీసుకువెళ్లి.. బ్యాంకింగ్ సేవలను అందించడం జరుగుతుంది.

Face Recognition for ATM and Bank Transactions : మీ డబ్బులు సేఫ్.. ఏటీఎంలో ఫేస్‌ రికగ్నిషన్..!

Loan Default : ఒకసారి లోన్‌ డిఫాల్డ్‌ అయితే.. మళ్లీ బ్యాంక్ రుణం మంజూరు అవుతుందా?​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.