ETV Bharat / business

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. ట్విట్టర్ సీఈఓగా రాజీనామా!

Twitter New CEO: టెస్లా సంస్థల అధినేత, ట్విట్టర్​ సీఈఓ ఎలాన్​ మస్క్​ సంచలన ప్రకటన చేశారు. ట్విట్టర్ అధికార బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్​కు కొత్త సీఈఓను వెతికే పనిలో నిమగ్నమైనట్లు తెలిపారు.

twitter new ceo
ట్విట్టర్​కు కొత్త బాస్​
author img

By

Published : Dec 21, 2022, 7:12 AM IST

Updated : Dec 21, 2022, 9:31 AM IST

Twitter New CEO: అక్టోబరులో ట్విట్టర్​ను సొంతం చేసుకున్న మస్క్‌.. ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సీఈఓగా కొనసాగాలా? లేక వైదొలగాలా? అని ప్రశ్నిస్తూ మస్క్‌ నిర్వహించిన పోల్‌లో ఎక్కువ మంది యూజర్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ మేరకు ఆయన ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన స్థానంలో వేరే వ్యక్తి వచ్చే వరకు ఆ స్థానంలో కొనసాగుతానని తెలిపారు. దీనికి సంబంధించి బుధవారం ఓ ట్వీట్​ చేశారు.

"సీఈఓ పదవిలో చేరే మూర్ఖుడు దొరికేంత వరకు ఆ స్థానంలో కొనసాగుతాను. ఆ తర్వాత దానికి రాజీనామా చేసి.. సాఫ్ట్​వేర్​ అండ్​ సర్వర్​ టీమ్స్​ను లీడ్​ చేస్తాను" అని బుధవారం ఓ ట్వీట్​ చేశారు. ఆదివారం నిర్వహించిన పోల్​కు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇకపై విధానపరమైన మార్పులకు సంబంధించి నిర్వహించే పోల్‌లో కేవలం ట్విట్టర్​ బ్లూ సబ్‌స్క్రైబర్లు మాత్రమే పాల్గొనేందుకు వీలుగా మార్పులు చేయనున్నట్లు తెలిపారు.

ట్విట్టర్​ సీఈఓగా ఉండాలా? వద్దా? అనే దానిపై నిర్వహించిన పోల్‌లో 57.5 శాతం మంది యూజర్లు మస్క్‌ వైదొలగాలని కోరగా.. 42.5 శాతం మంది మస్క్‌కు మద్దతుగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో మస్క్‌ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. "ట్విట్టర్​కు కొత్త సీఈఓను కనుక్కోవడం సమస్య కాదు. ట్విట్టర్​ను సమర్థవంతంగా కొనసాగించగలిగే సీఈఓను పట్టుకోవడమే సవాల్‌" అని ట్వీట్ చేశారు. "ట్విట్టర్​ను సమర్థవంతంగా కొనసాగించే ఉద్యోగం ఎవరికీ అవసరంలేదు. ఇందుకోసం వారసులు ఎవరూ లేరు" అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

Last Updated : Dec 21, 2022, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.