ETV Bharat / business

అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా? పెరిగిన EMI చెల్లించాల్సిందేనా? - హోం లోన్స్​పై ఆర్​బీఐ రెపో రేటు లేటెస్ట్ న్యూస్

ఆర్‌బీఐ రెపో రేటు పెంచడం వల్ల మరోసారి హోం లోన్స్ ప్రియం కానున్నాయి. అయితే, మునుపటిలా కాలవ్యవధిని కాకుండా ఈఎంఐ మొత్తాన్ని పెంచేందుకు బ్యాంకులు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే ఈఎంఐ ఎంత పెరిగింది? పెరిగిన ఈఎంఐ చెల్లించాల్సిందేనా?

rbi repo rate on home loan
హోం లోన్స్
author img

By

Published : Dec 8, 2022, 2:48 PM IST

ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్​బీఐ) మరోసారి రెపోరేటును 35 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ ఏడాది మే నెలలో 40 బేసిస్‌ పాయింట్లతో పెంపును మొదలు పెట్టిన ఆర్‌బీఐ.. విడతల వారీగా 2.25 శాతం మేర వడ్డీని పెంచింది. అక్టోబర్‌ వరకు పెంచిన 190 బేసిస్‌ పాయింట్ల వడ్డీని ఇప్పటికే రుణ సంస్థలకు రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. తాజా పెంపు నేపథ్యంలో వడ్డీని మరోసారి సవరించనున్నాయి. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఇప్పటికే గృహ, వాహన రుణాలు తీసుకున్న వారిపై మరోసారి వడ్డీ భారం పడనుంది. కొత్తగా తీసుకోవాలనుకునే వారూ రుణాలు తీసుకోవాలంటే వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది.

ఈఎంఐ ఎంత పెరిగింది?
కరోనా తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో గృహ రుణాలు చౌకగా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఓ దశలో 6.50 శాతానికే గృహ రుణం లభించింది. చాలా వరకు బ్యాంకులు, గృహ రుణ సంస్థలు పోటీపడి మరీ రుణాలు ఇచ్చాయి. ప్రాసెసింగ్‌ ఫీజు రద్దు, కొన్ని ఈఎంఐలపై రాయితీనీ అందించాయి. కట్‌ చేస్తే అప్పుడు తక్కువకే రుణాలు తీసుకున్న వారికి ఇప్పుడు గృహ రుణాలు భారమై కూర్చున్నాయి.

ఉదాహరణకు 2022 ఏప్రిల్‌లో ఒక వ్యక్తి 30 ఏళ్ల కాలానికి రూ.30 లక్షలు రుణం తీసుకున్నాడనుకుందాం. అప్పట్లో 7 శాతం వడ్డీ అనుకుంటే ఈఎంఐ రూ.19,954 వద్ద ఉండేది. తాజాగా ఆర్‌బీఐ పెరిగిన వడ్డీ రేటును బ్యాంకులు వినియోగదారులకు బదిలీ చేస్తే వడ్డీ 9.25 శాతానికి చేరుతుంది. అప్పుడు ఈఎంఐ రూ.24,680 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో నెల ఈఎంఐ రూ.4600 మేర పెరిగిందన్నమాట!

పెరిగిన ఈఎంఐ చెల్లించాల్సిందేనా?
ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన ప్రతిసారీ గృహ రుణాలపై వడ్డీని బ్యాంకులు పెంచుతూ వచ్చాయి. అయితే, వినియోగదారులపై ఆ భారం నేరుగా పడలేదు. కారణం.. బ్యాంకులు ఈఎంఐ మొత్తాన్ని పెంచకుండా కాలవ్యవధిని పెంచుకుంటూ పోవడమే. అంటే ఈఎంఐలు చెల్లించాల్సిన గడువు పెరుగుతూ వచ్చింది. సాధారణంగా 20, 25, 30 ఏళ్ల దీర్ఘకాలానికి గృహ రుణం తీసుకుని ఉంటారు. ఇప్పటి వరకు వడ్డీ పెరిగినప్పుడల్లా కాలవ్యవధిని పెంచిన బ్యాంకులు.. ఇకపై రిస్క్‌ తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. రుణం మొత్తం పూర్తయ్యేనాటికి రుణ గ్రహీత వయసు 60-65 ఏళ్లు ఉండేలా బ్యాంకులు చూసుకుంటాయి. ఈ కారణంతోనే తాజా వడ్డీ రేటు పెంపు వల్ల మరోసారి కాలవ్యవధిని పెంచేందుకు అవకాశం ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఈసారి పెరిగిన మొత్తాన్ని ఈఎంఐ మొత్తం పెంచేందుకు బ్యాంకులు మొగ్గు చూపొచ్చని అంటున్నారు.

ఇప్పుడేం చేయాలి..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.