ETV Bharat / business

Pay By Car : కార్డు, ఫోన్​లతో పనిలేదు.. కారు నుంచే ఆన్​లైన్ పేమెంట్స్​.. ఫాస్టాగ్ రీఛార్జ్ సైతం..

Pay By Car : ఆన్​లైన్​ చెల్లింపుల విషయంలో మరో కొత్త ఆవిష్కరణ తెరపైకి వచ్చింది. అదే Pay By Car. దీని సాయంతో బ్యాంక్​ కార్డులు, ఫోన్​లను వాడకుండానే నేరుగా కారు నుంచే పెట్రోల్​, డీజిల్​ చెల్లింపులు చేసుకోవచ్చు. త్వరలోనే ఈ సౌలభ్యం అందరికీ అందుబాటులోకి రానుంది.

Fuel Transactions Through Car Infotainment Systems
Fuel Payments Through Car Infotainment Systems Pay By Car
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 9:21 PM IST

Pay By Car : డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో మరో కీలక మార్పు రానుంది. అదే 'పే బై కార్'. దీనితో ఫోన్​, బ్యాంకు కార్డుల అవసరం లేకుండానే కారులోని ఓ సిస్టమ్​ ద్వారా నేరుగా పెట్రోల్​, డీజిల్​ చెల్లింపులను చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫీచర్​ సాయంతో ఫాస్టాగ్‌ రీఛార్జ్ సైతం చేసుకోవచ్చు. ఇందుకోసం ఓ వ్యవస్థను త్వరలోనే అందరికీ అందుబాటులో తేనుంది టోన్‌ట్యాగ్‌ అనే సంస్థ.( Payments Through Car Infotainment Systems )

Fuel Payments Through Car Infotainment Systems : మాస్టర్‌ కార్డు, అమెజాన్​ సాయంతో టోన్‌ట్యాగ్‌ అనే సంస్థ తాజాగా 'పే బై కార్‌'( Pay By Car ) అనే కొత్త ఆన్​లైన్​ పేమెంట్స్​ సిస్టమ్​ను ఆవిష్కరించింది. ఈ వ్యవస్థ యూపీఐ సపోర్ట్‌తో పనిచేస్తుంది. ఇటీవలే ఈ చెల్లింపుల వ్యవస్థను ఎంజీ హెక్టార్‌, భారత్‌ పెట్రోలియంలు సంయుక్తంగా కలిసి ప్రయోగాత్మకంగా పరీక్షించాయి. ఇటీవలే గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌లో ఎన్‌పీసీఐతో కలిసి యూపీఐలో కన్వర్జేషనల్‌ పేమెంట్‌ల సిస్టమ్‌ను టోన్‌ ట్యాగ్‌ ఆవిష్కరించింది. దీనితో మీ కారులో ఉండే ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ ద్వారా ఈ రకమైన చెల్లింపులను సులువుగా చక్కబెట్టేసేయవచ్చు. కాగా, ఇందుకోసం డెబిట్​, క్రెడిట్​ కార్డులు, ఫోన్​ అవసరం అస్సలు ఉండదు.

ఇలా పనిచేస్తుంది..!
Petrol Payments Through Car Infotainment System : మీరు పెట్రోల్‌ బంక్‌కు వెళ్లినప్పుడు మీ కారులో ఉండే ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్​ ఫ్యూయల్‌ డిస్‌పెన్సర్‌ నంబర్‌ను డిస్‌ప్లే చేస్తుంది. పెట్రోల్‌ బంక్‌కు రాగానే మీకు ఓ అనౌన్స్‌మెంట్‌ వినిపిస్తుంది. అలాగే పెట్రోల్ బంక్‌ సిబ్బందినీ కూడా ఈ వ్యవస్థ అలర్ట్‌ చేస్తుంది. ఆ తర్వాత ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ద్వారా మీకు ఎంత మొత్తంలో పెట్రోల్​ లేదా డీజిల్​ కావాలో ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని పెట్రోల్ సిబ్బందికి చేరవేస్తుంది. దీని ద్వారా కాంటాక్ట్​లెస్ పద్ధతిలో సురక్షితంగా పేమెంట్లు చేసుకోవచ్చు. మరోవైపు ఈ సదుపాయంతో ఫాస్టాగ్‌ రీఛార్జ్( Fast Tag Recharge Through Car Infotainment System ) కూడా సులువుగా చేసుకోవచ్చు. లావాదేవీల అనంతరం మీ ఖాతాలో ఎంత బ్యాలెన్స్‌ ఉందో అనే వివరాలు కూడా ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.