Hero Bike Diwali Festive Offer 2023: దీపావళి పండుగ వేళ మీరు కొత్త బైక్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే.. మీకో గుడ్‌న్యూస్. దిగ్గజ టూ వీలర్ తయారీ కంపెనీ "హీరో".. అదిరిపోయే ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. పండుగ సీజన్‌లో టూ వీలర్‌ల కొనుగోళ్లను పెంచుకునేందుకు హీరో గిఫ్ట్ (HERO GIFT గ్రాండ్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫ్ ట్రస్ట్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ గిఫ్ట్ స్కీమ్ ద్వారా అన్ని రకాల హీరో బైక్‌ల కొనుగోళ్లపై కంపెనీ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు, బై నౌ పే లేటర్, తక్కువ డౌన్ పేమెంట్, క్యాష్, EMI, ఐదేళ్ల స్టాండర్డ్ వారంటీ.. వంటి స్కీమ్స్ కూడా ప్రకటించింది. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హీరో బైక్‌లు, స్కూటర్లపై తగ్గింపు : దీపావళి పండుగకు హీరో బైక్‌లు, స్కూటీలను కొనుగోలు చేసే వినియోగదారులకు సంస్థ అదనపు ప్రయోజనాలను కల్పిస్తోంది. హీరో బైక్ కొనుగోలుపై రూ. 5,500 వరకు నగదు బోనస్, రూ. 3,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను అందిస్తామని చెప్పింది. దీనితో పాటు, కంపెనీ 'ఇప్పుడే కొనండి , 2024లో చెల్లించండి' వంటి ఫైనాన్స్ పథకాలను కూడా ప్రవేశపెట్టింది.
తక్కువ వడ్డీకే రుణాలు: ఈ పండుగ సీజన్‌లో ఎవరైనా హోండా బైక్స్ లేదా స్కూటర్‌లను కొనుగోలు చేయాలని అనుకుంటే.. వారికి అతి తక్కువ వడ్డీ రేటుకే వాహన రుణాలు కూడా అందిస్తామని కంపెనీ తెలిపింది. వాహన రుణ వడ్డీ రేటు గరిష్ఠంగా 6.99 శాతం మాత్రమే ఉంటుందని హీరో మోటో కార్ప్ వెల్లడించింది.
కొత్త రంగుల్లో బైక్‌లు : ఫెస్టివల్ సందర్భంగా కొన్ని బైక్‌లను సరికొత్త రంగుల్లో హీరో మోటోకార్ప్ తీసుకువచ్చింది. హీరో సూపర్ స్ప్లెండర్ XTEC బైక్‌ను స్టైలిష్ మ్యాట్ నెక్సస్ బ్లూ వేరియంట్‌లో తీసుకువచ్చింది. అలాగే స్ల్పెండర్+, స్ల్పెండర్+ XTEC మోడల్, Passion+, Passion XTEC ని బ్లాక్ గ్రే, మ్యాట్ యాక్సిస్ గ్రే రంగుల్లో తీసుకువచ్చింది.
స్కూటర్లలోనూ న్యూ కలర్స్ : హీరో స్కూటీలలో కూడా కొత్త కలర్ ఆప్షన్‌లు ఉంటాయని కంపెనీ తెలిపింది. హీరో జూమ్ ఎల్‌ఎక్స్ (Hero Xoom LX) స్కూటీ పెర్ల్ వైట్ సిల్వర్‌లో, ప్లెజర్ ఎల్‌ఎక్స్ (Pleasre LX) మ్యాట్ వెర్నియర్ గ్రే కలర్‌లో, ప్లెజర్ సీఎక్స్ (Pleasure CX) టీల్ బ్లూ, మ్యాట్ బ్లాక్ వేరియంట్‌లో ఉంటాయని హీరో మోటోకార్ప్ వెల్లడించింది. ఇప్పుడు Pleasure VX సరికొత్త మ్యాట్ బ్లాక్, పెరల్ సిల్వర్ వైట్ ఎడిషన్‌లను కలిగి ఉంటుందని వెల్లడించింది.
పెర్ల్ సిల్వర్ వైట్ కలర్‌లో హీరో Destini XTEC స్కూటీని, హీరో డెస్టినీ ప్రైమ్ (Destini Prime) స్కూటీలను నెక్సస్ బ్లూ, పెరల్ సిల్వర్ వైట్, నోబుల్ రెడ్ వంటి కొత్త కలర్‌లలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది.