ETV Bharat / business

జనవరిలో అన్ని కార్ల ధరలు హైక్? ఈలోగా కొనుక్కోవడమే బెటర్? - Audi India to hike prices up to 2 pc from Jan 2024

Maruti Suzuki Car Price Hike From 2024 In India In Telugu : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే త్వరపడండి. కొత్త ఏడాది నుంచి టాప్ బ్రాండ్​ కార్ల ధరలు అన్నీ పెరగనున్నాయి. ముఖ్యంగా మారుతి సుజుకి, ఆడి కంపెనీలు 2024 జనవరి 1 నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు స్పష్టం చేశాయి. ఇంకా ఏయే కార్ల ధరలు పెరగనున్నాయంటే?

audi Car Price Hike
Maruti Suzuki Car Price Hike
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 3:21 PM IST

Maruti Suzuki Car Price Hike From 2024 In India : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా 2024 జనవరి నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం, కమోడిటీ రేట్లు (ఉత్పత్తి కారకాల ధరలు) సహా, ఉత్పత్తి వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. మరోవైపు జర్మనీ లగ్జరీ కార్​ మేకర్​ ఆడి (Audi) కూడా 2024 జనవరి 1 నుంచి తమ కార్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది.

మారుతి సుజుకి కార్ల ధరలు
Maruti Suzuki Car Price Hike : భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి. ఇది ఎంట్రీ లెవెల్ కార్ అయిన ఆల్టో నుంచి మల్టీ-యుటిలిటీ కార్​ అయిన ఇన్​విక్టో వరకు అన్ని రేంజ్​ల వెహికల్స్​ను విక్రయిస్తోంది.

మారుతి సుజుకి విక్రయిస్తున్న అత్యంత తక్కువ ధర కలిగిన కారు ఆల్టో. ప్రస్తుతం మార్కెట్​లో దీని ధర రూ.3.54 లక్షల వకు ఉంది. మారుతి సుజుకి ఇన్​విక్టో కారు ధర రూ.28.42 లక్షల వరకు ఉంటుంది. వీటి ధరలు 2024 జనవరి నుంచి పెరగనున్నాయి. అయితే మారుతి సుజుకి తమ కార్ల ధరలను ఎంత శాతం మేరకు పెంచుతుందనే విషయాన్ని ప్రస్తుతానికి వెల్లడించలేదు.

maruti suzuki cars
మారుతి సుజుకి కార్లు

2% వరకు పెరగనున్న ఆడి కార్ల ధరలు
Audi Car Price Hike : జర్మనీకి చెందిన లగ్జరీ కార్​ తయారీ సంస్థ ఆడి (Audi).. 2024 జనవరి 1 నుంచి భారత్​లో తమ కార్ల ధరలను 2 శాతం మేర పెంచుతున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, ఉత్పత్తి ఖర్చులే ఇందుకు కారణమని పేర్కొంది. అందువల్ల భారత్​లోని అన్ని ఆడి కార్ల మోడళ్ల ధరలు వచ్చే ఏడాది నుంచి పెరగనున్నాయి.

తమ కంపెనీతోపాటు, డీలర్ల మనుగడ కోసం ఈ ధరల పెంపు తప్పడం లేదని ఆడి ఇండియా హెడ్​ బల్బీర్​ సింగ్ ధిల్లాన్​ తెలిపారు. అయితే కస్టమర్లపై ఈ ధరల పెంపు ప్రభావం వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు.

ఆడి కంపెనీ భారత్​లో Q3 SUV నుంచి స్పోర్ట్ కార్​ RSQ8 వరకు అన్ని రేంజ్​ల కార్లను విక్రయించింది. వీటి ధరల రేంజ్​ వరుసగా రూ.42.77 లక్షల నుంచి రూ.2.22 కోట్ల వరకు ఉంటుంది.

audi cars
లగ్జరీ ఆడీ కార్లు

2024లో లాంఛ్​ కానున్న టాప్​-6 కార్లు ఇవే! ఫీచర్స్, లుక్స్​ అదుర్స్​!

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టాప్​-10 కార్లు ఇవే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.